Hina khan : బాలీవుడ్ లో అత్యద్భుతమైన ఫ్యాషన్ ను ఫాలో అయ్యే హీరోయిన్లలో హీనా ఖాన్ కూడా ఒకరు. ఈమె ఫ్యాషన్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తన ఫ్యాషన్ డైరీస్ కి సంబంధించిన స్నిప్పెట్స్ ను ఇన్ స్టాగ్రామ్ ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఎత్నిక్ ఫ్యాషన్ అయినా క్యాజువల్ దుస్తులైనా తనదైన స్టైల్ లో ధరించి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది హీనా. తన లుక్స్ తో యూత్ కు కిక్కిస్తుంటుంది. తాజాగా చేసిన ఓ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Hina khan : ఓ ఫోటోషూట్ కోసం హాట్ బ్లాక్ మెటాలిక్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది హీనా ఖాన్. ఈ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో కుర్రాల హృదయాలను దోచేస్తుంది. స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లాక్ కార్సెట్ క్రాప్ టాప్ ని వేసుకొని క్యూట్ లుక్స్ తో కవ్వించింది ఈ చిన్నది. బ్లాక్ మిర్రర్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ టాప్ హీనాకు స్పెషల్ లుక్ ని అందించింది. ఈ టాప్ కి జోడీ గా బ్లాక్ మెటాలిక్ స్నేక్ స్కిన్ డీటెయిల్స్ తో , థై హై స్లిట్ ఉన్న బాటమ్ వేసుకుంది.

బ్లాక్ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగానే జ్యువెలరీని ఎన్నుకుంది హీనా. మెడలో ఆక్సిడైస్డ్ గోల్డెన్ చోకర్ నెక్లెస్ ,నుదుటన పాపిట బిల్ల పెట్టుకుంది. చేతికి గోల్డెన్ బ్యాంగిల్స్ ని వేసుకొని ఎంతో స్వీట్ గా కనిపించింది హీనా. ఈ డ్రెస్సింగ్ స్టైల్ లో అద్దం ముందు నిలబడి అందాల ఫోజులిస్తూ తనలోని గ్లామర్ లుక్స్ ని మరోసారి ఫాన్స్ కు పరిచయం చేసింది . ఎప్పటిలాగే ఈ అవుట్ ఫుట్ తో దిగిన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోల కింద మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్ అని క్యాప్షన్ ను జోడించింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సోనాక్షి కన్సల్ రాథోడ్ ఈ బ్యూటీకి స్టైలిష్ లుక్స్ ని అందించింది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, బ్లాక్ హైలైనర్ మస్కరా దిద్దుకుని పెదాలకు పాస్టల్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఆధారగొట్టింది.

ఈ మధ్యనే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో డ్రామాటిక్స్ తో వచ్చిన షార్ట్ డ్రెస్ వేసుకొని కుర్రాళ్ళ మతులు పోగొట్టింది హీన. ఈ పొట్టి డ్రెస్ లో తన బ్యాక్ సైడ్ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది.

అంతకు ముందు పాస్టల్ బ్లూ కలర్ శారీ కట్టుకొని క్లీవేజ్ షో తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. డీప్ నెక్ కలిగిన బ్లౌజ్ తో హాట్ బ్యాక్ ని చూపిస్తూ మంత్రముగ్ధులను చేసింది.
