Himanshu Rao తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు అప్పుడప్పుడూ మీడియాకు కనిపిస్తుంటాడు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా వన్ కార్ రేస్‌లో పాల్గొని సందడి చేశాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి రేస్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న హిమాన్షు.. అక్కడ రోడ్డుపై సందడి చేశాడు. కార్ రేస్ జరుగుతున్న తీరును ఆసక్తిగా తిలకించాడు హిమాన్షురావు. దీంతోపాటు అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
కార్ రేస్ తిలకించడానికి వెళ్లిన హిమాన్షు రావు.. ఓ ఆసక్తికర పని చేసి అందర్నీ ఆకర్షించాడు. ఫార్ములావన్ రేస్ చూస్తున్న సమయంలో అక్కడే రోడ్డు పక్కన బేల్‌పురి తిన్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా రోడ్డుపక్కన చిన్న బుట్ట వ్యాపారి వద్ద బేల్‌పురి తినడంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరలవుతోంది. బుట్ట వ్యాపారి వద్దకు వెళ్లిన హిమాన్షు.. తనకు బేల్‌పురి కావాలంటూ అడిగి మరీ తిన్నాడు.
హిమాన్షు వెంట బాడీగార్డులు ఉన్నారు. అయితే, తాను, ఫ్రెండ్స్ బేల్‌పురి తిన్నాక బుట్ట వ్యాపారికి కాస్త నగదు కూడా అందించాడు హిమాన్షు. అనంతరం పరిణతి చెందిన వ్యక్తిలాగా ప్రవర్తించాడు హిమాన్షు. వ్యాపారిని క్షేమ సమాచారాలు అడిగి తెలుసున్నాడు. అలాగే వ్యాపారం ఎలా సాగుతోందంటూ ఆరా తీశాడు హిమాన్షు. ఇలా కాసేపు గడిపిన తర్వాత రేస్ జరుగుతున్న చోటకు బయల్దేరాడు హిమాన్షురావు.
Himanshu Rao ట్రోలర్స్‌కు పంచ్ ఇచ్చిన హిమాన్షు
ఇక సాధారణ జనం పెద్ద సంఖ్యలో హిమాన్షును చూడ్డానికి ఆసక్తి కనబరిచారు. చాలా మంది తమకు సెల్ఫీలు కావాలంటూ తీసుకున్నారు. కాస్త ఓపికగానే హిమాన్షు అందరితోనూ సెల్ఫీలు దిగాడు. మరోవైపు బరువు విషయంలో హిమాన్షుపై కొంత కాలం కిందట భారీగా ట్రోల్స్ వచ్చాయి. అయితే, వీటన్నింటికీ చెక్ పెడుతూ కష్టపడి బరువు తగ్గాడు హిమాన్షు. ట్రోలర్స్‌కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడంటూ కేసీఆర్, కేటీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.