High blood pressure: నీరు లేనిదే ఈ ప్రపంచం లేదు. ఈ భూమ్మీద ఏ జీవి అయినా మనుగడ సాగించాలంటే జలం తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, వరి, గోధుల ఇలా ఏది పండాలన్నా నీళ్లు లేనిదే సాధ్యం కాదు. పంచభూతాల్లో ఒకటైన నీరు లేకపోతే మనిషి కూడా బతుకీడ్చలేరు. మన శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో సరిపడా నీరు లేకపోతే ఎన్నో రకాలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనిషి అన్నం లేకపోయినా ఉండగలడేమో కానీ నీరు లేకపోతే మాత్రం ఉండలేరు.
నీళ్లను ఎంత మోతాదులో తాగాలి..?
శరీరంలో సరిపడినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ కు గురై నీరసించి కళ్లు తిరిగి పడిపోతారు. అయితే డాక్టర్లు మాత్రం ప్రతిరోజు తప్పకుండా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగమని చెబుతూ ఉంటారు. శరీరానికి సరిపడినంత నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారని అంటుంటారు. కానీ అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తగినంత నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తుంటారు.
హై బీపీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. నీళ్లు హై బీపీని నియంత్రణలో ఉంచుతాయి. అప్పుడే గుండె సమర్థవంతంగా పనిచేస్తూ శరీరం మొత్తానికి రక్తాన్నిసరఫరా చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
High blood pressure: వర్కౌట్స్ తప్పనిసరి..!
శారీరక శ్రమ చేయడం, ఆల్కహాల్ ను ఎక్కువగా సేవించకపోవడం, ధూమపానం అలవాటును మానుకోవడం వంటి వాటి ద్వారా హైబీపీని నియంత్రణలో ఉంచొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు పుష్కలంగా నీరు తాగితే అధిక రక్తపోటు సమస్యను తరిమికొట్టొచ్చని సూచిస్తున్నారు. రక్తపోటు సమస్యను తగ్గించడం కోసం నీరును తక్కువ పరిమాణాల్లో తరచూ తాగుతూ ఉండాలి. అలాగే ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి నీటిని సరైన మోతాదులో ఎక్కువ సార్లు తాగడం అలవాటు చేస్కోండి. తద్వారా రక్తపోటు లాంటి వ్యాధులను తరిమికొట్టండి.