Heroine Samantha: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంతకు ఆరోగ్యం బాగోలేని విషయం అందరికీ తెలిసిందే. ఆమె మయోసైటిస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా ప్రకటించింది. అయితే ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుండగా.. దీని గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సమంత ప్రస్తుతం మయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో ఉందని, ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పలు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సమంత మేనేజర్.. ఆమె బాగానే ఉందని, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రెస్ నోట్ విడుదల చేయడం తెలిసిందే. కాగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.
హీరోయిన్ సమంత తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధికి ఇంగ్లిష్ మందులను వాడుతోంది. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె తన చికిత్స విషయంలో కీలక నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు వాడిన ఇంగ్లిష్ మందులను ఇక మీద ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుందట. దీనికి కారణం ఆమె తన ట్రీట్మెంట్ విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవడం అని తెలుస్తోంది.
Heroine Samantha:
సమంత తన వ్యాధికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవాలని నిర్ణయించుకుందట. అందుకు తగ్గట్టుగానే ఆయుర్వేద డాక్టర్ ను ఇప్పటికే సంప్రదించి.. ఆయుర్వేదం ప్రకారం ట్రీట్మెంట్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిస్థాయి చికిత్స కోసమే సమంత ఆయుర్వేదం వైపు మళ్లిందనే టాక్ వినిపిస్తోంది.