Heroine Revathi: రేవతి భారతీయ సినిమా నటి. ఈమె అసలు పేరు ఆశ. 1966 లో కేరళలోని కొచ్చిన్ లో జన్మించింది. ఈమె తల్లి ఒక మిలిటరీ ఆఫీసర్. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకొని 1979లో చెన్నైలోని అరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది. ఇక సినిమాలపై ఆసక్తితో 1983లో కట్టతే కిలికోడు అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
1984లో మానసవీణ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతూ తెలుగు మలయాళం కన్నడ భాషలలో నటించింది. 1992లో విడుదలైన అంకురం సినిమా ఈమె కెరీర్ ని మలుపు తిప్పింది ఈ చిత్రం ద్వారా ఈమె ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతూ మంచి నటిగా సౌత్ లో పేరు తెచ్చుకున్న రేవతి1986 లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ వివాహం చేసుకుంది.
ఆ తరువాత భర్త తన సంపాదన పై ఆధారపడడం, తను హీరో కావాలి అనుకుని నటించిన మొదటి చిత్రం పరాజయం పాలు కావడం, ఆ తర్వాత దర్శకుడుగా మరో చిత్రం రూపొందించి అది కూడా పరాజయం పొందింది. ఆ రెండు సినిమాలతో రేవతి సంపాదించిన ఆస్తి అంత పోయింది. ఇక పిల్లలు వద్దనుకుంది, భర్త కూడా అంగీకరించి బంధువులు పిల్లలు కాలేదని వేధించిన కూడా భర్త ఏ మాత్రం జోక్యం చేసుకునేవాడు కాదు. తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు.
తాను కూడా కొంతకాలం మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇక నటన ద్వారా సంపాదించిన డబ్బులు భర్త విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు బాగా పెరిగి 2002 నుండి విడిగా జీవించడం ప్రారంభించారు. 2013లో చట్టబద్ధంగా చెన్నై న్యాయస్థానంలో విడాకులు తీసుకున్నారు. ఒక అనాధ పాపను దత్తత తీసుకొని పెంచుకుంటున్నట్లు తెలుస్తుంది.
Heroine Revathi:
మొత్తానికి భర్తతో విడిపోయి మంచి పని చేసిందని తెలిసినవారు సంతోషించారు. ఇక ఈమె కొన్ని సినిమాలకు డబ్బింగ్ కళాకారునిగా, కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. ప్రస్తుతం ఈమె రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.