తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాత దిల్ రాజు ఎనౌన్స్ చేసేశారు. తెలుగు, తమిళ్ బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో లోకేష్ యూనివర్స్ లోనే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే మాస్టర్ కి సీక్వెల్ తరహాలో ఉంటుందా లేదా కొత్త కాన్సెప్ట్ తో తీస్తున్నాడా అనేది తెలియరాలేదు. ఇప్పటికే ఈ సినిమా క్యాస్టింగ్ అంతా ఫైనల్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ మళ్ళీ స్ట్రైట్ తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. లేదంటే తెలుగు పాన్ ఇండియా మూవీగా ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది. దీనికి కారణంగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతోంది.
ఇప్పటికే విజయ్ తో తమ బ్యానర్ లో సినిమాని నిర్మించడానికి ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఈ సినిమాకి దర్శకుడికి అట్లీని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో సుల్తాన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ తో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యలో మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు మాత్రమే కాకుండా ఇతర బాషలలో కూడా సినిమాలని నిర్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. రీసెంట్ గా అమలాపాల్ తో ద్విజ అనే మలయాళీ సినిమాని నిర్మించింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తుంది.