తమిళ్ స్టార్ హీరో సూర్య చాలా కాలంగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సూర్య తమ్ముడు కార్తి అయితే ఊపిరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక తన ప్రతి సినిమాని తెలుగు, తమిళ్ కి సమ ప్రాదాన్యత ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఇక సూర్య మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాల దగ్గర అవుతున్న తెలుగు స్ట్రైట్ సినిమా మాత్రం చేయలేకపోతున్నాడు. అయతే గత కొంత కాలంగా తెలుగులో నేరుగా సినిమా చేయాలనే ప్రయత్నం సూర్య చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ అయిన యూవీ క్రియేషన్స్ సూర్యని తెలుగులో లాంచ్ చేయాలని అనుకుంటుంది.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా సూర్యతో తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే ఈ మధ్య వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ హిట్ అయ్యాయి. ఈ నేపధ్యంలోనే త్వరలో తన తెలుగు సినిమా ఉంటుందని కూడా ఓ ఇంటర్వ్యూలో సూర్య ప్రకటించాడు. అయితే ఎవరితో ఉంటుందనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది టాక్ వినిపించింది. త్రివిక్రమ్ కూడా తమిళ్ ఎంట్రీ కోసం సూర్యని సెలక్ట్ చేసుకున్నాడని చర్చ నడిచింది.
అయితే అలాంటిదేమీ లేదని తాజాగా వినిపిస్తున్న సమాచారం. తమిళ్ స్టార్ దర్శకుడుతోనే సూర్య తెలుగు స్ట్రైట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. తెలుగులో గోపీచంద్ తో శౌర్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తరువాత తమిళ్ లో వరుసగా అజిత్ తో హిట్స్ సినిమాలు చేసిన డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఉండే అవకాశం ఉందని బోగట్టా. ప్రస్తుతం సూర్య బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.