ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హీరో రామ్ సొంతం చేసుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడు లాంటి హ్యాండ్ సమ్ లుక్స్ తో హీరోగా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు వరకు రామ్ అంటే లవర్ బాయ్ తరహాలోనే పాత్రలు, కథలు చేస్తూ వచ్చాడు. కమర్షియల్ సినిమాలు చేసిన అందులో కూడా లుక్స్ పరంగా పెద్దగా వేరియేషన్స్ ఉండేవి కావు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అలరించేవాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తన రూట్ పూర్తిగా మార్చేశాడు . ఎక్కువగా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలు, లుక్స్ తో కనిపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ రామ్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి. ఇక తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో పోలీస్ కథతో ది వారియర్ సినిమాతో రామ్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కథనంలో దమ్ము లేకపోవడంతో సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కి రీచ్ కాలేదు. కానీ రామ్ మాత్రం పోలీస్ పాత్రలో అందరిని మెప్పించాడు. ఇక ఈ సారి మరింతగా తన ఇమేజ్ ని మార్చుకోవడానికి ఏకంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ రెడీ అయ్యాడు.
బోయపాటి అంటే పక్కా మాస్ మసాలా మూవీగానే ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద ఆయుధాలు, హీరో మాస్ లుక్స్ సినిమాలో కామన్. అలాగే ఈ సినిమా కోసం రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే డ్యూయల్ రోల్ అంటే రెండు పాత్రలలో లుక్స్ ఒకే విధంగా ఉండేవి మాత్రం కాదు. సరికొత్తగా కనిపించడానికి రామ్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. సినిమాలో ఒక పాత్ర కోసం లావుగా కనిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో ఏకంగా 11 కేజీలు వెయిట్ పెరగడానికి రామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి రామ్ ప్రయోగం ఎంత వరకు బోయపాటి సినిమాకి, తన కెరియర్ కి హెల్ప్ అవుతుంది అనేది చూడాలి.