Hero Nikhil: టాలీవుడ్‌లో ఉన్న టాలెండెండ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. ఫ్రెండ్ క్యారెక్టర్లతో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుని తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పరాజయాలు వచ్చినా కుంగిపోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. స్వామిరారా, కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలతో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కార్తికేయ 2తో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
కార్తికేయ2 చిత్రం సెట్స్‌పై ఉండగా, కరోనా సమయంలోనే పల్లవివర్మ అనే అమ్మాయిని నిఖిల్ పెళ్లిచేసుకున్నాడు. తాజాగా వీరిద్దరిపై షాకింగ్ న్యూస్ వైరలవుతోంది. నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో దూరంగా ఉంటున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు ఎంతగా ఒప్పించే ప్రయత్నిం చేసినా వినలేదని కామెంట్స్ వినిపించాయి. అయితే వీటన్నిటికీ ముగింపు పలికేలా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు నిఖిల్.
సోషల్ మీడియా పోస్టుతో క్లారిటీ..
నువ్వు పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్భుతం అన్నట్లుగా భార్య పేరును ట్యాగ్ చేస్తూ, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసాడు. దీనితో తన విడాకుల వదంతులు అన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసినట్టు అయ్యిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అయితే నిఖిల్ ఈ ఏడాదిలో రెండో రిలీజ్ 18 పేజెస్‌తో రెడీగా ఉన్నాడు. అలాగే ఇందులో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
Hero Nikhil:
కాగా, విడాకులపై మీడియాలో వచ్చిన వార్తలకు ఆ మధ్య ఒక టాక్ షోలోనే నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. పల్లవితో అంతా బాగానే ఉందని పేర్కొన్నాడు. ఆమెతో తాను చక్కని జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. అయినప్పటికీ వార్తలు ఆగకపోవడంతో మరోసారి సోషల్‌మీడియాలో స్పందించాడు.