హీరో నిఖిల్ కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా స్టార్ హీరోగా పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయాడు. ఈ నేపధ్యంలో తన నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ తో నిఖిల్ జతకట్టాడు. మరో వైపు కొత్త దర్శకుడితో స్పై థ్రిల్లర్ కథని పాన్ ఇండియా లెవల్ లోనే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే తాజాగా హీరో నిఖిల్ తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడు అనే టాక్ వచ్చింది.
గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, దీంతో ఇద్దరు విడిగా ఉంటున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. గత ఏడాదిలోనే నిఖిల్ కి భీమవరంకి చెందిన పల్లవివర్మతో పెళ్లయింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళై ఏడాదిలోనే విడిపోతున్నారు అంటూ జరిగిన ప్రచారంకి తాజాగా నిఖిల్ ఫుల్ స్టాప్ పెట్టాడు. భార్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి నీవు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ ట్విట్ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్ కి ఫుల్ స్టాప్ పడింది.
గత కొంతకాలంలో సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. స్నేహ, ప్రసన్న విడిపోయినట్లు ప్రచారం నడిచింది. దానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ మరో కథ వినిపించింది. అయితే వీరిద్దరూ కలిసి ఓ హిందీ టీవీ షో చేస్తున్నారు అనే విషయం రివీల్ అయ్యింది. అయితే ఇప్పుడు నిఖిల్, పల్లవి విడాకుల గురించి వార్తలకి కూడా నిఖిల్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టాడు.