Nagarjuna : హీరో నాగార్జున రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఏపీ అధికార వైసీపీ పార్టీలో ఆయన చేరతారనే ఊహాగానాలు గత కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. గత కొద్దిరోజులగా మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో వార్తలపై నాగార్జున ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని నాగార్జున స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ అరగ్రేటంపై నాగార్జున స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, విజయవాడ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తాను విజయవాడా ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవం అన్నారు. ఎన్నికలుక వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని, ఇందులో నిజం లేదన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇందులో కొత్తగా ఏమి లేదన్నారు.
Nagarjuna :
అయితే మంచి కథ వస్తే సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించానలి ఉందని నాగార్జున తెలిపారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వైసీపీ తరపున ప్రముఖ నిర్మాత పీవీఆర్ పోటీ చేసి ఓడిపోయారు. పీవీఆర్ తో పాటు సీఎం జగన్ తో నాగార్జునకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నాగార్జున ఫ్యామిలీ సొంత జిల్లా కూడా కృష్ణా జిల్లానే. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన నాగార్జున ఖండించడంతో ఆ ప్రచారానికి తెలపడింది.