Hero Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు కార్తికేయ.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అనంతరం పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు.ఇలా ఈయన చేసిన తదుపరి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈయన కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే కార్తికేయ విలన్ గా హీరో అజిత్ తో కలిసి వలిమై సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా హీరోగా విలన్ పాత్రల్లో నటించినప్పటికీ ఈయనకు అదృష్టం కలిసి రాకపోవడంతో ఈయనకు సరైన హిట్ ఇప్పటివరకు పడలేదని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో హిట్ సినిమా కోసం ఎంతో కష్టపడుతూ ఎన్నో విభిన్న కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతిసారి ఈయనకు చేదు అనుభవమే ఎదురవుతుంది.
ఇకపోతే వలిమై సినిమా తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైన ఈయన అసలు ఏం చేస్తున్నారో అనే విషయం గురించి అందరూ ఆరాతీస్తున్న నేపథ్యంలో ఈయన తదుపరి సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం సెప్టెంబర్ 21కార్తికేయ పుట్టినరోజు కావడంతో ఈయన సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని వెల్లడించారు.
Hero Karthikeya: గ్రామీణ కథా నేపథ్యంలో రానున్న బెదురులంక..
రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సినిమాకు బెదురులంక 2012′ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఈ సినిమాలో ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయని,ఈ సినిమాలో బలమైన కథతో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ కూడా ఉండబోతుందని చిత్ర బృందం ఈ సినిమా గురించి వెల్లడించారు. గోదావరి నేపథ్యంలో కామెడీ బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలను అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.