సౌత్ ఇండియాలో భిన్నమైన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ అంటే కమల్ హాసన్ పేరు ముందుగా వినిపిస్తుంది, ఆ తర్వాత చియాన్ విక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. వీరి తర్వాత ఆ స్థాయిలో భిన్నమైన పాత్రలతో సినిమాలు చేసే హీరోల జాబితాలో సూర్య పేరు ఉంటుంది. ఓ వైపు కమర్షియల్ కథలు చేస్తూనే మరో వైపు భిన్నమైన కథలతో ప్రయోగాలు చేయడం సూర్య అలవాటు. నటుడిగా అతను ఇప్పటికి 17 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సూర్య నిర్మాణంలో తమ్ముడు కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో కార్తీ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యాడు.
ఇదే సమయంలో సర్దార్ టీజర్ తో మెస్మరైజ్ చేశారు. అభిమాన్యుడు ఫేమ్ మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సర్దార్ సినిమాలో కార్తీ మొదటి సారి భిన్నమైన గెటప్స్ లో అలరించబోతున్నాడు. సూర్య తర్వాత అన్నలానే తన ఇమేజ్ ని కూడా పెంచుకోవడానికి విభిన్న గెటప్స్ ని సర్దార్ సినిమా కోసం ట్రై చేశాడు. ఆ గెటప్స్ ని ఎలివేట్ చేస్తూ, యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సర్ధార్ టీజర్ ఉంది. యాక్షన్ ఘట్టాలు చేయడమాలో కార్తీకి మంచి ఈజ్ ఉంది.
ఇక సర్ధార్ సినిమాలో వాటిని మరో లెవల్ లో చూపించబోతున్నాడని టీజర్ బట్టి అర్ధమవుతుంది. కార్తీ ఇప్పటికే ఊపిరి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి చేరువ అయిపోయాడు. ఈ నేపధ్యంలో సర్ధార్ సినిమాకి తెలుగులో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రలలో కనిపించబోతున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. దీపావళి కానుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.