హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో సెలబ్రెటీలు తమ అభిమానులకి అందుబాటులో ఉంటారు. ఇక సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారు చాలా మంది తమకి ఇష్టమనైనా నటీనటులని అనుసరిస్తూ వారికీ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో హీరోల కంటే హీరోయిన్స్ కి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. దానికి కారణం వారు పెట్టె హాట్ హాట్ ఫోటోలు. హీరోయిన్స్ అందాలనిఎప్పటికప్పుడు చూడాలనే ఆసక్తి ఉన్నవారు వారిని ఫాలో అవుతూ ఉంటారు. బేసిగ్గా మగవాళ్ళు అందరికి అమ్మాయిల వీక్ నెస్ ఉంటుంది.
ఒక అమ్మాయి అందమైన డ్రెస్సులో లేదంటే హాట్ డ్రెస్సులో కనిపిస్తే ఆటోమేటిక్ గా కళ్ళు అటువైపు వెళ్లిపోతాయి. ఇక హీరోయిన్స్ విషయంలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఫాలోవర్స్ ఎక్కువ. అయితే హీరోల విషయంలో కేవలం అభిమానం మాత్రమే పని చేస్తుంది. తమకి ఇష్టమైన హీరోలకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆసక్తితోనే వారిని ఫాలో అవుతున్నారు.
ఇలా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోల జాబితా చూసుకుంటే అందులో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉంటాడు. తరువాత ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఉంటారు. అయితే కోలీవుడ్ హీరోలు సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యనే వారు కూడా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్స్ స్టార్ట్ చేసి యాక్టివ్ అవుతున్నారు. ఇక కోలీవుడ్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ధనుష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తాజాగా అతను 11 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్ ని క్రాస్ చేసాడు. ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా ధనుష్ కోలీవుడ్ లో ఉండటం విశేషం.