Actress Priyamani: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై హీరోయిన్ గా, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం కెరీర్ పరంగా అయితే జట్ స్పీడ్ తో దూసుకుపోతోంది ప్రియమణి. సినిమాల పాత్రలో విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
ఇటీవలే విరాటపర్వం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం ప్రియమణి సైనైడ్ అనే బైలింగ్వేల్ మూవీ లో కూడా నటిస్తోంది. అలాగే ప్రియమణి షారుక్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటుగా తెలుగు,హిందీ, కన్నడ,తమిళ భాషలో నటిస్తోంది. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే..
ఈమె తన భర్త ముస్తఫా రాజ్ తో విడిపోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా తెగ వైరల్ అవ్వడంతో నిజం లేదు అంటూ ఆ వార్తలకు చెక్ పెట్టేసింది ప్రియమణి. ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రియమణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ప్రియమణి కొత్త పెళ్లికూతురు లాగా ముస్తాబయింది. తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లె పూలు పెట్టి సాంప్రదాయబద్దంగా రెడీ అయింది.
సాంప్రదాయబద్ధంగా రెడీ అయినప్పటికీ ఆ చీర కట్టులో పైట చాటు నుండి నెలవంక నడుమును చూపిస్తూ తన అందాన్ని ఆరబోసింది. మొత్తంగా ఈ చీర కట్టులో పెళ్లికూతురు లాగే కనిపిస్తోంది ప్రియమణి. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫోటోలను చూసిన అభిమానులు ప్రియమణి అందం ముందు కుర్ర హీరోయిన్లు ఏ మాత్రం పనికిరారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.