hebah patel: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ నీ ఏర్పరచుకుంది.
హెబ్బా పటేల్ తెలుగులో కుమారి 21ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించింది. హీరోయిన్ గా హెబ్బా పటేల్ ఊహించిన విధంగా సక్సెస్ కాకపోవడంతో మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది.
అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతే కాకుండా పలు ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేసి తన డాన్స్ స్టెప్పులతో యువత దృష్టిని మరింత ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో హెబ్బా పటేల్ నుంచి ఎటువంటి సినిమాలు కూడా రాలేదు.
అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచు తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. అలాగే ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె రోజురోజుకీ తన అందాన్ని పెంచుకుంటూ యువతకి చెమటలు పట్టిస్తోంది. ఎప్పటిలాగే తాజాగా సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను బట్టి చూస్తే ఆమె ఎక్కడో టూరిజం కి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది.
ఆ ఫోటోలలో ఆమె వెనుకల అంతా కొండ ప్రాంతాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండ ప్రాంతాలలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.