hebah patel: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలామందికి ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే కుమారి 21 ఎఫ్ సినిమా గుర్తుకు వస్తుంటుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హెబ్బా పటేల్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడమే కాకుండా విపరీతమైన పాపులారిటీని కూడా సంపాదించుకుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. హెబ్బా పటేల్ తెలుగులో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలలో నటించింది. హీరోయిన్ గా హెబ్బా పటేల్ ఊహించిన విధంగా సక్సెస్ కాకపోవడంతో మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అంతేకాకుండా పలు ఐటమ్ సాంగ్స్ తో కూడా మెప్పించింది.
అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి హీరో ఇంకా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా ఆమె నటించిన అన్ని ఇండస్ట్రీలలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో హెబ్బా పటేల్ ఎటువంటి సినిమాలలో నటించలేదు అన్న విషయం తెలిసిందే.
అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచు తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక హెబ్బా పటేల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
View this post on Instagram
రోజురోజుకీ తన అందాన్ని పెంచుకుంటూ యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హెబ్బా పటేల్ పబ్బులో అద్భుతంగా డాన్స్ చేసింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.