Healthy Tea : మనలో చాలామందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగుతూ ఉంటారు. ఇలా టీ తాగడం వల్ల ప్రశాంతంగానూ, కాస్త రీఫ్రెష్ గానూ ఉంటుందని చెబుతుంటారు. అయితే టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండగా.. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
ఎక్కువగా హైబీపీతో ఇబ్బందిపడే వారు లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందుతారట. అందుకే వైద్యులు లెమన్ గ్రాస్ టీని తాగాలని సలహా ఇస్తుంటారు. అలాగే లెమన్ గ్రాస్ టీని తీసుకోవడం వల్ల హై సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని డిజిటల్ జర్నల్ రీసెర్చ్ గేట్ లో ప్రచురించిన ఓ కథనంలో వివరించబడింది.
లెమన్‌గ్రాస్‌లో క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోరియంటిన్, స్వెర్టియాజపోనిన్ వంటి గుండె ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి కరోనరీ ధమనుల లోపల కణాలు పనిచేయకపోవడాన్ని నివారించడంలో సాయపడతాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించే సామర్థ్యాన్ని లెమన్ గ్రాస్ టీ కలిగి ఉంటుందని తేలింది.
Healthy Tea :
వీటికితోడు బరువు తగ్గాలనుకునే వారు లెమన్ గ్రాస్ టీని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. దీని వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని కూడా తేలింది. కాబట్టి కేవలం టీ తాగడం కన్నా లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల టీ తాగిన అనుభూతిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.