Healthy Food: మనం ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఎప్పుడైనా నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, నిరంతరం ఆరోగ్యం మీ సొంతం కావాలంటే కొన్ని ఆరోగ్య ప్రమాణాలు, సూత్రాలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా తీసుకొనే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలి. పోషకాహారం తప్పక తీసుకోవాలి. పోషకాహారమంటే కేవలం ఖరీదైన వాటిలోనే ఉండదు. సామాన్యులకు అందుబాటు ధరల్లో కూడా నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంది.
మధ్య తరగతి వారికీ అందుబాటు ధరల్లో దొరికే కొన్ని పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా సజ్జల గురించి చెప్పుకోవాలి. సజ్జలను తినడం వల్ల ప్రొటీన్లు, కేలరీలు బాగా దొరుకుతాయి. పేదవాడి ఆహారంగా కూడా సజ్జలను పిలుస్తారు. సజ్జలను రోజూ తీసుకోవడం వల్ల శారీరకంగా శక్తిమంతులవుతారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు కూడా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి.
అరటి పండ్లు కూడా తక్కువ ధరకు దొరికే వాటిలో ఉంటాయి. ఏ సీజన్ లో అయినా ఇవి దొరుకుతాయి. డజన్ రూ.40 నుంచి రూ.80 మధ్య దొరికేస్తాయి. పిల్లలు, పెద్దలు వీటిని తీసుకోవడం వల్ల ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, మాంగనీస్, నియాసిన్, విటమిన్ బి6 సహా అనేక పోషక విలువలు పెంపొందుతాయి. జీర్ణ సమస్యలకు కూడా అరటిపండు చెక్ పెడుతుంది.
Healthy Food:
సీఫుడ్, పౌల్ట్రీ, మాంసానికి ప్రత్యామ్నాయంగా చిక్పీస్ ను వినియోగించవచ్చు. వీటిలో ప్రొటీన్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ఆకుకూరల్లో బచ్చలి కూర తీసుకోవడం వల్ల విటమిన్ కె దొరుకుతుంది. పెసరపప్పు తీసుకుంటే ప్రొటీన్లతో పాటు కడుపులో ఆకలి వేయకుండా చాలా సమయం ఉండగలరు.