Health Tips: మనలో చాలామందికి జంక్ ఫుడ్ చూడగానే తినాలని అనిపిస్తుంటుంది. రోడ్డు పక్కన అలా నడుచుకుంటూ వెళుతుంటే.. మనకు పక్కనే ఉన్న పిజ్జా లేదంటే బర్గర్ మనకు నోట్లో నీళ్లు తెప్పిస్తుంది. ఇంకేముంది అలా దాని దగ్గరికి వెళ్లి, కొని, కడుపులో వేసుకుంటాం. నిజానికి ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఇంతకీ దానికి కారణాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పోషకాల లోపం:
మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందాలి. అయితే ఇలా శరీరానికి పూర్తిస్థాయిలో అందాల్సిన పోషకాల్లో లోపం ఉంటే.. అప్పుడు మనకు తినే కోరిక పెరుగుతుంది. ఫలితంగా మనకు ఆకలి బాగా వేస్తుంది. అప్పుడు మనం జంక్ ఫుడ్ ని చూస్తే నోరూరుతుంది మరియు ఆకలిగా అనిపిస్తుంది.
నీరు తాగకపోవడం:
మన శరీరానికి తగిన స్థాయిలో నీటిని అందించాలి. నీరు సరిగ్గా అందకపోతే శరీరం డీహైడ్రేడ్ అవుతుంది. కాబట్టి కొన్నిసార్లు మన శరీరం దాహం వేస్తున్న సంకేతాన్ని ఆకలి రూపంలో వ్యక్తపరుస్తుంది. అంటే శరీరానికి నీరు సరిగ్గా అందకపోతే అప్పుడు ఆకలి అవుతుంది.
హార్మోన్ల అసమతుల్యత:
శరీరంలోని ప్రతి చర్యకు హార్మోన్ల అవసరం ఉంటుంది. శరీరంలోని హార్మోన్లు సరిగ్గా విడుదల అయితే ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడితే మాత్రం మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం లోపిస్తుంది. ఫలితంగా విచిత్రంగా బలమైన కోరికలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఆకలిగా అనిపించడం, జంక్ ఫుడ్ చూడగానే తినాలనే కోరిక కలగడం జరుగుతుంది.
ఒత్తిడి:
మనం ఒత్తిడికి లోనైప్పుడు కూడా ఆకలి కోరిక కలుగుతుందట. ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం కారిస్టాల్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. దీని వల్ల మనకు కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలని అనిపిస్తుందట.
Health Tips:
వీటికి తోడు శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే చాక్లెట్లు, గింజలు లేదా బీన్స్ తినాలని.. షుగర్ డ్రాప్స్, క్రోమియం, ఫాస్పరస్ లోపం వల్ల చక్కెర తినాలని అనిపిస్తుందట. అలాగే శరీరంలో సోడియం లోపం వల్ల ఉప్పగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫ్రైడ్ ఫుడ్ తినాలని కోరిక బలంగా కలుగుతుంది.