Health Tips: శాకాహార ప్రియులూ.. ఇది మీ కోసమే. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు రోజూ తింటే ఆరోగ్యం మీవెంటే ఉంటుంది. వాటిలో కావాల్సినంత విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్లు కలగిసి ఉంటాయి. పోషకాహార లోపంతో బాధపడేవారు ఆకు కూరలు తింటే పుష్కలంగా అందుతాయి. రోజువారీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే ఇక మీ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. చాలా మంది మాంసాహారంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. కానీ అది తప్పంటున్నారు డైటీషియన్లు. శాకాహారంలోనూ మీరు కోరుకున్న ప్రోటీన్లు, మాంసకృత్తులు ఉంటాయంటున్నారు.
నిజానికి శాకాహారంతోనే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. మాంసం తినడం వల్ల బలం చేకూరినా, కొవ్వు పదార్థాలు ఎక్కువైతే శరీరానికి కోరి హాని తెచ్చుకున్నట్లే. పండ్లు కూరగాయల్లో మాంసాహారంతో దీటుగా పోషకాలు ఉంటాయి. ఏ పదార్థాలు తీసుకుంటే ఎలాంటి పోషకాలుంటాయో తెలుసుకోవడం ముఖ్యం. శాకాహారం తీసుకొనే వారంతా తప్పక తెలుసుకోవాలి.
మనకు మార్కెట్ లో దొరికే వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. ఇది తీసుకోవడం వల్ల, ఈ దుంపల్లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బీ9, ఐరన్ బాగా దొరుకుతుంది. దుంపలు తినడం వల్ల కండరాల పునరుద్ధరణ జరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు ఉంటాయి. వంటింట్లో నిత్యం అదుబాటులో ఉండే పసుపులోనూ అనేక ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలుసు. పసుపు వంట రుచిని మరింత పెంచుతుంది. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
Health Tips:
కూరగాయల మార్కెట్ లో దొరికే వాటిలో టమోటా కూడా ప్రధానమైనది. వీటిలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. ఇవిగాక ఉసిరికాయ, ఆకు కూరలనూ వీలైంత ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. ఆకు కూరల్లో బచ్చలికూర, మెంతికూరలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.