Health Tips: ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత జీవన విధానం కారణంగా చిన్న వయసులో కూడా కొందరు మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవాళ్లు లేస్తే కూర్చోలేరు.. కూర్చుంటే లేవలేరు. చాలామందికి అయితే చిన్న చిన్న పనులకే షుగర్, బీపీ వంటి రోగాలతో పాటు కీళ్ళనొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు వేలకు వేలు డబ్బులు ఖర్చుపెట్టి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆలివ్ చెట్టు ఆకుల రసం తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ లేదా ఆలివ్ చెట్ల ఆకుల సారం పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయని తెలియజేస్తున్నారు.
ఆలివ్ ఆకుల్లోని ఔషధాలను పాలీఫెనాల్స్ అని పిలుస్తారు. ఇవి కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో కృషి చేస్తాయి. ఆలివ్ ఆకులు రొమ్ము క్యాన్సర్, అల్సరేటివ్, డిప్రెషన్ తగ్గించడంలోనూ సహాయపడతాయని సైంటిస్టులు వెల్లడించారు. ఆలివ్ ఆకుల రసం కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనాన్ని అందిస్తుందని తెలిపారు. ఆలివ్ ఆయిల్ గుండె ధమనుల లోపల చేరుకున్న కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. తద్వారా గుండెకు రక్షణ అందిస్తుంది.
Health Tips: వెల్లుల్లితోనూ ఉపశమనం
అంతేకాకుండా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ వెల్లుల్లి తీసుకోవడం ఎంతో మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మరీ ఘాటుగా అనిపిస్తే.. దానికి ఉప్పు, ఇంగువ, జీలకర్ర కలిపి తీసుకుంటే వెల్లుల్లి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.