Health Tips: పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించే మునగ మొక్కలో మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలు పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మునగ ఆకు, బెరడు పువ్వులు, మునక్కాయలు ఇలా మునగ చెట్టులోని ప్రతి భాగాన్ని దాదాపు 300 రకాల వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్య పోవాల్సిందే. మునగాకులో యాంటీ ఫంగల్ ,యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ప్లిమెంటరి గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
తాజామునగాకుల్లో కన్నా పోడిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మునగాకు పొడి మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. ఒక గ్రాము మునగాకు పొడిలో పాలలో కన్నా 12 రేట్లు కాల్షియం, క్యారెట్ లో కన్నా 10 రేట్లు విటమిన్ A గుడ్లలో కన్నా 9రేట్లు మాంసకృత్తులు, బత్తాయిలో కన్నా 7 రేట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే పాల కూర కన్నా 25రేట్లు ఎక్కువ ఇనుము,అరటి పండులో కన్నా 15 రేట్లు పొటషియం అధికంగా ఉండి మన శరీర పెరుగుదలకు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
మునగాకు పొడిని ఉదయం సాయంత్రం టి రూపంలో తీసుకున్నట్లయితే మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల సయాటికా, కీళ్లనొప్పుల్లో మునగను వాడడం మేలు జరుగుతుంది.మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 100 గ్రాముల మునగ ఆకుల పొడిలో కనీసం 28 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది కావున రక్తహీనత సమస్య ఉన్నవారు మునగాకు పొడి దివ్య ఔషధంగా భావించవచ్చు.
Health Tips: పోషకాహార లోపాన్ని నివారించవచ్చు..
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు పోషక ఆహార లోపాన్ని సవరించుకోవడానికి ప్రతిరోజు మునగాకును కూరగా చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. మునగ పువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధులు దరి చేరవు.