Health Tips: ఆధునిక కాలంలో చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో
గుండె సంబంధిత సమస్యలు ప్రధానమైనదిగా చెప్పవచ్చు.ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు సిగరెట్ ,మద్యపానం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం,ఒకే చోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం,మానసిక ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు వంటివి ప్రధానంగా చెప్పవచ్చు.మనం సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి పోషక విలువలతో కూడిన ఆహారం ఎంత అవసరమో అంతే శారీరక శ్రమ అవసరమవుతుంది.
ప్రతిరోజు తగిన శారీరక శ్రమ లేకపోతే శరీరంలో చెడును కలిగించే కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధులకు దారితీయవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా కొంత శ్రమ కలిగిన నడక,వ్యాయామాలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కలిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారికి నడక ఉత్తమమైన వ్యాయామంగా చెప్పవచ్చు .
అయితే ఒకేసారి ఎక్కువసేపు నడిస్తే అలసట వచ్చి వేరే సమస్యలకు దారి తీయవచ్చు. కావున
స్టాప్ అండ్ గో స్టైల్ వాకింగ్ చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. మీలోని నెగెటీవ్ ఆలోచనలను నియంత్రించుకోండి. మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా, మీ నియంత్రణలో ఉంచుకోవడంపై దృష్టి సారించండి.
Health Tips: శారీరిక శ్రమ అవసరం
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం అందువల్ల వీరు క్రమం తప్పకుండా యోగా చేయడం, కాసేపు ఇష్టమైన మ్యూజిక్ వినడం ఉత్తమం. అయితే హృదయ సంబంధిత వ్యాది మరియు శ్వాస సంబంధమైన వ్యాధి ఉన్నవారు ఇబ్బంది లేనంతవరకు మెట్లు ఎక్కడాన్ని ప్రతిరోజు పాటించవచ్చు.ఈత కొట్టడం ద్వారా రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మొదట వైద్యుల్ని సంప్రదించి తర్వాత మీకు అనువైన వ్యాయామం చేయడం ఉత్తమమైన మార్గం.