Health Tips: ఎవరికి ఎప్పుడు, ఎలా దగ్గు వస్తుందని చెప్పలేం. అయితే దగ్గు సమస్య చాలా ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంటుంది. అయితే మామూలుగా మనకు రెండు రకాలుగా దగ్గు వస్తుంటుంది. కఫంతో కూడిన దగ్గు ఒక రకం అయితే, పొడి దగ్గు మరో రకం. మామూలుగా అయితే చాలామందికి కఫంతో కూడిన దగ్గు వస్తుంది.
కొంతమందికి మాత్రం పొడి దగ్గు వేధిస్తుంటుంది. పొడి దగ్గు వచ్చిన వారికి గొంతు నొప్పి, మంట ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పొడి దగ్గు ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటుంది. దీని వల్ల రాత్రిపూట నిద్రపోవడం నరకంగా మారుతుంది. పొడి దగ్గు ఎక్కువైతే పక్కటెముకలు నొప్పికి లోనవుతాయి. దీని వల్ల ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.
పొడి దగ్గు రావడానికి అనేక కారణాలు ఉండగా.. వాటిలో అలెర్జీలు, యాసిడ్ రిఫ్లక్స్, వాతావరణ మార్పులు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కూడా ఉంటాయి. అయితే ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ లేకపోయినా దీని వల్ల తలెత్తె ఇబ్బందులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. అందుకే దీనిని వెంటనే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
Health Tips:
పొడి దగ్గు నివారణకైన పసుపును మిరియాలతో కలిపి తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనకు మేలు చేస్తాయి. ఇందుకోసం వేడి పాలలో 1 టీస్పూన్ పసుపు, 1/8 టీస్పూన్ మిరియాలు కలిపి తీసుకుంటే.. పొడి దగ్గు ఇట్టే తగ్గుతుంది.