Health Tips: కాయ కూరల్లో రారాజుగా వంకాయను పిలుస్తారు. పేరుకు తగ్గట్టే వంకాయతో చేసిన వంటకాలు అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందించి మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ప్రతిరోజు మన ఆహారంలో వంకాయను కర్రీ, వేపుడు, వంకాయ బజ్జి ఇలా ఏదో రూపంలో తీసుకోవడం సర్వసాధారణమే. కొన్ని అపోహల దృశ్య చాలామంది వంకాయను తినడానికి ఇష్టపడరు. వంకాయలో ఉన్న పోషక విలువలు వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే విటమిన్ బి 1, బి 2, బి 3, బి 6, బి 9, విటమిన్ సి , విటమిన్ ఇ, విటమిన్ కె వంటి సూక్ష్మ పోషకాలు నిండుగా ఉన్నాయి.
వంకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి శరీరానికి అవసరమైన పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండి, కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, అతిగా బరువు పెరగడం వంటి సమస్యలు దరి చేరవు
ముఖ్యంగా వంకాయలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి మెరుగు పడడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా ఉబ్బసం, మలబద్ధకం,పెద్ద పేగు క్యానర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వంకాయల్లో అధికంగా ఉండే ఐరన్, పోలిక్ యాసిడ్, కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడడమే కాకుండా హిమోగ్లోబిన్ ఉత్పత్తి మెరుగుపడి రక్తహీనత వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
Health Tips:
వంకాయలో సోడియం శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. కావున అధిక రక్తపోటు తో బాధపడే వారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు.
వంకాయ తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి కొంత అలర్జీ ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.