Health Tips: చిరునవ్వుకు అందాన్ని ఇచ్చేది మన దంతాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే
చాలామంది తమ ఆనందాన్ని నవ్వుతూ నలుగురితో పంచుకోవడానికి , మాట్లాడడానికి
ఇబ్బంది పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం దంతాలు గార పట్టి పసుపు రంగులో ఉండటం లేదా దంతాల వరుస సక్రమంగా లేకపోవడమే. దంతాలపై ఉండే ఎనామిల్ పొర దంతాలను దృఢంగా ఉంచడంతోపాటు తెల్లగా మెరుస్తూ సహజ అందాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
దంతాల దృఢత్వానికి తోడ్పడే ఎనామిల్ పొర క్షీణించడానికి కారణం మన ఆహారంలో ప్రతిరోజు జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే కెమికల్ దంతాలపై ఉండే ఎనామిల్ పొరను దెబ్బతీస్తుంది. అలాగే ప్రతిరోజు
ఉదయం, రాత్రి పడుకునే ముందు దంతాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి లేకపోతే మనం తిన్న ఆహారం పళ్ళ మధ్య ఇరుక్కుని హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దాంతో పళ్ళపై ఉండే ఎనామిల్ పొర క్షీణించి పళ్ళు గార పట్టి పచ్చగా మారుతాయి. దంతాలపై పసుపు రంగును తొలగించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లకు బదులు మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలతో మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎన్నో ఔషధ గుణాలున్న తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి ఆ తులసి పొడితో ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలపై ఉండే పసుపు వర్ణం తొలగిపోవడమే కాకుండా దంత సమస్యలకు దూరంగా ఉంచవచ్చు.
నిమ్మరసంతో వంటసోడాను మెత్తని పేస్టులా కలుపుకొని మన దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలపై ఉండే పసుపు రంగు తొలగిపోతుంది. నిమ్మకాయ లో ఉండే విటమిన్ సి దంతాల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఒక స్పూను కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఆయిల్ ఫిల్లింగ్ చేస్తే మన శరీరంలోని విష పదార్థాలను తొలగించడమే కాకుండా దంతాలపై ఉండే హానికర బ్యాక్టీరియాను తొలగించి దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
బాగా పండిన స్ట్రాబెర్రీలను తీసుకొని అందులో వంట సోడా కలిపి మెత్తని పేస్టులా చేసి దంతాలపై మర్ధన చేయడం వలన స్ట్రాబెర్రీలో ఉండే యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి సహాయపడతాయి.
Health Tips:
ఎన్నో ఔషధ గుణాలు ఉన్న లవంగాలను పొడిచేసి దానితో దంతాలపై రుద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల దంతాలు తళతళా మెరవడమే కాకుండా దృఢంగా కూడా ఉంటాయి.
మీ దంత సమస్యలు మరి తీవ్రతరంగా ఉంటే మీ దగ్గరలోని వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించండి.