Donkey Milk: మార్కెట్ లో గాడిద పాలకి మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే గాడిద పాలు ఆవు పాలు కంటే మేలు అయినవి. ఎందుకంటే ఆవు పాలలో కంటే గాడిద పాలల్లో కొవ్వు చాలు తక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలు ఇంచుమించు తల్లిపాలు అంత శ్రేష్టమైనవి అంట. గాడిద పాలు తాగటం వల్ల ఆస్తమా, దగ్గు, ఊబకాయం, జలుబు, కిడ్నీలో రాళ్లు, జాండీస్ వంటి సమస్యలు మటుమాయమైపోతాయట. అంతేకాదు కీళ్ల నొప్పులను సైతం నయం చేసే ఔషధ గుణం గాడిద పాలలో ఉందట.
అయితే ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాల ధర చాలా ఎక్కువ. అటువంటి గాడిద పాలను విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉన్నాడు. పెద్దవారికి 200 రూపాయలు. ఇంకా చిన్నవారికి వంద రూపాయలు ధర నిర్ణయించి వాళ్ళ ముందే గాడిద పాలు పితికి ఇస్తున్నాడు. దీంతో అతగాడు విశాఖపట్నంలో ఫేమస్ అయిపోయాడు. అతని కోసం చాలామంది కస్టమర్లు వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది.
కళ్ళముందే ఖరీదైన గాడిద పాలు పితికి సరసమైన ధరలలో అందిస్తూ ఉండటంతో జనాలు ఎగబడుతున్నారు. ఇక ఇదే సమయంలో గాడిద పాలు తాగటం వల్ల కలిగే లాభాలను కూడా అతగాడు వివరిస్తూ ఉన్నాడు. దాదాపు గాడిద పాలు లీటర్ ధర 3 వేల రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుందట. కానీ విశాఖపట్నంలో ఈ వ్యక్తి ఇంటి వద్దకే వచ్చి.. గాడిద పాలు తగ్గించే వ్యాధులు తెలియజేస్తూ.. చిన్న పిల్లలకు మంచిది అంటూ వివరిస్తూ చిన్న కప్పు 100 రూపాయలు. పెద్దవారికి 200 రూపాయలు అంటూ అమ్ముతూ ఉండటంతో.. విశాఖ జనాలు ఏగబడుతున్నారు.