Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం చివరకు వచ్చేసింది. హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా మారింది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న రాజ్ కెప్టెన్ కావటం సంచలనం రేపింది. మొదటి వారంలో అసలు రాజ్ పెద్దగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అటువంటి రాజ్ రెండు వారానికి తన ఆట తీరు మార్చుకునీ ఇంటి సభ్యులందరితో చక్కగా కలిసిపోయారు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్ కావటం విశేషం. ఇక ఇదే సమయంలో కెప్టెన్ పోటీదారుడుగా సుల్తానా.. ఎన్నికైన గాని ఆమెకు ఒకే ఒక్క ఓట్ వచ్చింది.
మొదటివారం దాదాపు సుల్తానా హౌస్ నుండి వెళ్ళిపోతుందని అందరూ భావించారు. కానీ ఆమె ఆట తీరం మొత్తం మార్చుకుని ఎవరిని నమ్మకుండా తనని తాను నమ్ముకుని గేమ్ ఆడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్ లో హీరో సుధీర్ బాబు హీరోయిన్ కృతి శెట్టి హౌస్ లోకి రావడం తెలిసిందే. ఇంటి సభ్యులందరికీ టాస్కులు ఆడించిన వాళ్ళిద్దరూ.. బిగ్ బాస్ ఇచ్చిన సమయం ముగియడంతో చివరన వెళ్ళిపోయారు.
ఈ పరిణామం జరిగిన తర్వాత రేవంత్… ఆదిత్య వద్ద చంటి, ఫైమా పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫైమా నీ ఉద్దేశించి చాలా చిన్నతనంగా మాట్లాడాడు. అదే సమయంలో అక్కడ సుల్తానా కూడా ఉంది. ఈ సంభాషణ జరిగిన అనంతరం అదే రోజు రాత్రి సుల్తానా.. వాసంతి వద్ద డిస్కషన్ పెట్టింది. హౌస్ లో అందరూ నచ్చుతున్న గాని.. రేవంత్ నచ్చటం లేదు. అందరు దగ్గర ఇతరులను బ్యాడ్ చెస్తూ సింపతి సంపాదించుకుంటున్నాడు. ఈ సీజన్ మొత్తానికి ప్రతి నామినేషన్ లో వాడు ఉంటాడు అంటూ సుల్తానా చాలా ఘాటుగా కామెంట్లు చేయడం జరిగింది.