చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోల మీద విమర్శలు, వివాదాలు కచ్చితంగా ఉంటాయి. అలాగే అందరి హీరోలకి అభిమానులు ఉంటారు. ఈ అభిమానులు తమకి నచ్చని హీరోని, ఆ హీరోల ఫ్లాప్ సినిమాలని దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఒకరి మీద ఒకరు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతో విభేదించే వారు ఉండారు. అలాగే హీరోలు కూడా మీడియా సమావేశాలలో, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సమయంలో ఒక్కోసారి తమ సహనం కోల్పోతూ ఉంటారు. ఈ సమయాలలో వివాదాలలో ఇరుక్కుంటారు. అలాగే సినిమాల విషయంలో కూడా తమ వర్గాన్ని కించపరిచారు అంటూ కొంత మంది విమర్శలకి గురవుతూ ఉంటారు.
యూనివర్సల్ గా ప్రతి ఒక్కరిని మెప్పించడం ఎవరికి సాధ్యం కాదనే విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం ఇండియన్ వైడ్ గా ఉన్న స్టార్ హీరోలలో అస్సలు వివాదాలు, కాంట్రవర్సీలు లేని హీరోగా ఉన్న వ్యక్తి ఎవరంటే కచ్చితంగా ప్రభాస్ పేరు అందరూ చెబుతారు. ప్రభాస్ ని అభిమానించే వారిలో మిగిలిన స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఏ ఒక్కరు కూడా అతన్ని టార్గెట్ చేయరు. ట్రోల్ చేయరు. అలాగే ఇండస్ట్రీలో కూడా అసలు వివాదాలకి దూరంగా, విమర్శలకి దూరంగా ఉండే ఏకైక హీరో అంటే ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ మీద ఈ రకమైన అభిప్రాయం ఉండటానికి కారణం అతని మనస్తత్వం. ఎంత మందిలో ఉన్నా కూడా ఎవరిని నొప్పించే ఆలోచన అతనిది కాదు.
ఆఫీస్ బాయ్ నుంచి నిర్మాత వరకు అందరిని డార్లింగ్ అంటూ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించడం ప్రభాస్ స్వభావం. నవ్వుతూ నాలుగు మాటలు అనే ఫిలాసఫీని ప్రభాస్ చక్కగా ఫాలో అవుతాడు. ఎవరి మీద అసహనం చూపించడు. ఆప్యాయంగా పలకరించే అతని అలవాటు ఇండస్ట్రీలో అందరికి అతనిని దగ్గర వ్యక్తిని చేసేసింది. అలాగే బయట కూడా అన్ని వర్గాల వారు అభిమానించే హీరోగా మార్చేసింది. వెండితెర మీద మాత్రమే ప్రభాస్ లో రౌద్రరసం చూడగలం. బయట మాత్రం చూడలేమని చాలా మంది చెప్పే మాట. అనుష్కతో ప్రేమ, పెళ్లి అనే పుకారు తర్వాత మరొకటి కాంట్రవర్సీ అతని లైఫ్ లో లేదు. అయితే 20 ఏళ్ళ సుదీర్ఘ కెరియర్ లో మొదటి సారి ఆదిపురుష్ సినిమాతో వివాదాలలో ఇరుక్కున్నాడు. రామాయణాన్ని వక్రీకరించి తెరకెక్కించారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ ని ఎవరూ కూడా బ్లేమ్ చేయడం లేదు. దర్శకుడు, నిర్మాతలు మాత్రమే పాయింట్ చేస్తున్నారు.