chapatis and rotis: పరాటా, చపాతీ, రోటీలకు రకరకాలైన కూరగాయల కర్రీలో మటన్ కర్రీలు చేసుకొని తింటారు. చపాతీలో, రోటీలలో, పరాటాలో ఏ కూరగాయలైనా రుచికరంగానే ఉంటాయి. ఇక ఇందులో మాంసానికి సంబంధించిన కర్రీలు అయితే మరీ రుచికరంగా ఉంటాయి.
చాలా మంది కూరగాయల కన్నా మాంసాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా మాంసాన్ని ఇష్టపడే వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ల కోసం స్పెషల్ గా మటన్ రెసిపీస్ నెట్లో వెతికి మరి చేసి పెడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం మరొక రెసిపీ మీ ముందుకు వచ్చింది.
రుచికరమైన కీమా దాల్ రెసిపి. ప్రతిసారి కర్రీలు, పప్పులు కాకుండా ఇలా అదే పప్పుతో కీమా చేసి ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని పప్పు లేదా బటానీలతో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనికి దాదాపు 45 నిమిషాలు సమయం పడుతుంది. అలా 45 నిమిషాల్లో మీరు రుచికరమైన కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. అయితే ఈ కీమా దాల్ రెసిపిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా కీమా దాల్ రెసిపి కు కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: నూనె, తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరయాలు, తరిగిన టమోటాలు, జీలకర్ర, కొత్తిమీర,
పొడి, ఉప్పు, మేక మాంసం/ చికెన్/ టర్కీ, ఒక కప్పు టమోటాలు, 2 1/2 కప్పుల నీరు, గరం మసాలా, పుదీనా నిమ్మరసం. పసుపు పొడి.
తయారీ విధానం: ముందుగా కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఉల్లిపాయ వేసి అవి బ్రౌన్ రంగులో వచ్చేంత వరకు వేయించాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం, టమోటా, పచ్చిమిరియాలు వేసి బాగా కలిపి వేయించాలి. ఆ తర్వాత పసుపు పొడి, జీలకర్ర కొత్తిమీర, గరం మసాలా, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు మటన్ కీమాను అందులో వేసి మటన్ కాస్త రంగు మారేంతవరకు వేయించాలి. ఆ తర్వాత అందులో నీరు వేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి. కుక్కర్ లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుండి తీసి ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి గరం మసాలా పొడి పుదీనా ఆకులు నిమ్మరసం వేయాలి.. వేసి బాగా కలపాలి.
chapatis and rotis:
ఇక తర్వాత స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అందులో ఉల్లిపాయలు వేయించి.. ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, వేయించిన ఆ ఉల్లిపాయ ముక్కలను గార్నిష్ చేసుకొని ఆనందంగా రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన కీమా దాల్ రేసిపి రెడీ. దీన్ని పరాటాల్లో గాని చపాతీలో గాని రోటీలలో కానీ తినవచ్చు ఇది వీటన్నిటికీ అద్భుతమైన కాంబినేషన్.