Harnaaz Sandhu : మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటి నుంచి హర్నాజ్‌కు ఇన్‌స్టాలో ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె తన అందచందాలతో, ఒంపు సొంపులతోనే కాదు మెన్ స్ట్రువల్ ఈక్విటీ అనే ప్రాజెక్ట్ తోనూ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.తాజాగా ఈ 22 ఏళ్ల బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ఇంటెర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని క్లోజప్ యాంగిల్‌లో దిగిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Harnaaz Sandhu : ప్లంగింగ్ నెక్‌లైన్ ఫిగర్ హగ్గింగ్ డీటైల్స్‌తో వచ్చిన రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ మిర్చీలా చెలరేగిపోయింది ఈ మిస్ యూనివర్స్. అవుట్ ఫిట్ ముందు భాగంలో వచ్చిన టై డీటైల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. హాలోవెన్ డే ముందు రోజు పోస్ట్ చేసిన ఈ పిక్స్‌కు ” హ్యాపీ హాలోవెన్ ” అని క్యాప్షన్‌ను జోడించింది. ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌తో గ్లామరస్ పోజులను ఇచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ హర్నాజ్ ఇన్ స్టా ఇన్ బాక్స్‌ను కామెంట్లు, లైక్‌లతో నింపేశారు. ఆమె అందాలను పొగుడ్తలతో ముంచేశారు.

డార్కర్ లిప్ పెన్సిల్‌తో పెదాలకు న్యూడ్ లిప్‌షేడ్ పెట్టుకుంది హర్నాజ్. కనులకు స్మోకీ ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా వేసుకుని అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇక మధ్యపాపిట తీసుకుని తన వేవీ కురులను లూజ్‌గా విడిచిపెట్టింది.తన స్టైలిష్ లుక్స్‌తో అందరి చూపుని తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

ఈ మధ్యేనే జరిగిన దీపావళి పండుగ రోజున మెరిసేటి తెల్లటి లెహెంగా సెట్ వేసుకుని అందరిని మైమరపించింది హర్నాజ్.. ఫాల్గుని షానే పికాక్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ సీక్విన్డ్ లెహెంగా సెట్‌ను ఎన్నుకుంది. ఆ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగానే జ్యువెల్లరీని అలంకరించుకుని దేవకన్యలా మెరిసిపోయింది.


అంతకు ముందు ఓ బ్లాక్ అవుట్‌ఫిట్ వేసుకుని అపార్ట్‌మెంట్ కారిడార్‌లో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. పొట్టి డ్రెస్సును ధరించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది ఈ చిన్నది. డీప్ నెక్‌లైన్ ఫుల్ స్లీవ్స్ , ఫిగర్ హగ్గింగ్ డీటైల్స్‌తో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌లో హర్నాజ్ ఎంతో హాట్ గా కనిపించింది. క్లీవేజ్ షో తో పాటు తొడల అందాలను చూపించి యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది.