Harnaaz Sandhu : 21 ఏళ్ల తరువాత భారతీయ యువతి హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ 22 ఏళ్ల విశ్వ సుందరి ప్రస్తుతం వివిధ దేశాలను పర్యటిస్తూ మిస్ యూనివర్స్ బాధ్యతలను నిర్వహిస్తోంది. అంతేకాదు హర్నాజ్ హాట్ ఫోటో షూట్‌ల ద్వారా సోషల్ మీడియాలో ఫ్యాషన్ గోల్స్‌ను అందిస్తోంది. తాజాగా హర్నాజ్ అద్భుతమైన అవుట్‌ఫిట్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ల మనసును దోచేస్తోంది. ఈ ఫోటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తోంది.

Harnaaz Sandhu : ప్రస్తుతం కొలంబియా పర్యటనలో ఉన్న హర్నాజ్ సంధు ఐస్ బ్లూ కలర్ ప్యాంట్ సూట్ సెట్ వేసుకుని తలకు మావీ కలర్ టోపీ పెట్టుకుని పచ్చని మొక్కల మధ్య ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హర్నాజ్ మంచి క్యాప్షన్‌ను జోడించింది. ప్రజల పొగడ్తలు మీ తలకు, ప్రజల క్రిటిసిసమ్ మీ మనసుకు తాకకుండా చూసుకోవాలి అని క్యాప్షన్‌ను జోడించింది హర్నాజ్.

హర్నాజ్ వేసుకున్న ఈ అవుట్‌ఫిట్ చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. ఐస్ బ్లూ కలర్ షేడ్ ప్యాంట్ సూట్ హర్నాజ్ కలర్ కు బాగా సెట్ అయ్యింది. ఇక హర్నాజ్ లోపల షర్ట్ వేసుకోకుండానే నాట్చ్ లేపెల్ కాలర్స్, ఫుల్ లెన్త్ స్లీవ్స్, ప్యాచ్ పాకెట్స్ వచ్చిన జాకెట్ వేసుకుని అందరి లుక్స్‌ను తనవైపు తిప్పుకుంది. ఈ జాకెట్‌కు మ్యాచింగ్‌గా హై వెయిస్టెడ్ ఫ్లేర్డ్ ప్యాంట్ ధరించింది. చెవులకు గొల్డెన్ హూప్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుంది. పాదాలకు మ్యాచింగ్ స్ట్రాపీ హై హీల్స్ వేసుకుంది.

హర్నాజ్ తన కురులతో మధ్యపాపిట తీసి లూజ్‌గా వదులుకుంది. కనులకు సబ్టిల్ షిమ్మరీ పింక్ ఐ ష్యాడో, బ్లాక్ వింగెడ్ ఐ లైనర్, మస్కరా , డివీ మేకప్ వేసుకుని ఎంతో గ్లామరస్‌గా కనిపించింది.

రీసెంట్‌గా హర్నాజ్ పర్పుల్ కలర్ మిని డ్రెస్ వేసుకుని అందరి మైండ్ బ్లాక్ చేసింది. కార్సెట్ బెల్ట్ డీటైల్స్‌తో వచ్చిన ఈ ఊబర్ స్టైలిష్ లుక్‌లో హర్నాజ్ అందాలు రెట్టింపయ్యాయి. టర్టిల్ నెక్‌లైన్, ప్యాడెడ్ షోల్డర్స్, మిని హెమ్ లెన్త్, ఫ్లోయీ స్కర్ట్, ఫుల్ లెన్త్ బిల్లోవీ స్లీవ్స్‌తో వచ్చిన ఈ పర్పుల్ అవుట్‌ఫిట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా హర్నాజ్ చెవులకు గోల్డ్ హూప్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుంది. పాదాలకు గోల్డ్ స్ట్రాపీ హై హీల్స్ వేసుకుని స్టైలిష్ లుక్స్‌తో అందరిని కట్టిపడేసింది.
