రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి చేస్తున్న ఖుషి సినిమాపై ప్రస్తుతం విజయ్ శ్రద్ధ పెట్టాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. సమంత స్టార్ హీరోయిన్ కావడంతో బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా రీచ్ అవుతుందని భావించి శివ నిర్వాణ ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఇక లైగర్ తో విజయ్ దేవరకొండ కూడా ఎంతో కొంత బాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యాడు. ఇక ఖుషి సినిమా ఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ప్రేమకథా చిత్రాలకి బాలీవుడ్ మంచి ఆదరణ ఉంటుంది.
ఇక విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ టెన్షన్ నుంచి బయటపడి ఖుషి షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ ఫైనల్ కాకున్నా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తా అని దిల్ రాజు గతంలోనే చెప్పాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ దొరకడంతో అతని సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ కి సరిపడా స్టోరీని తన కంపనీలో రైటింగ్ టీంతో రాయించి రెడీ చేసినట్లు బోగట్టా.
ఇక విజయ్ ని డైరెక్ట్ చేసే బాధ్యతలు ఎవరికి అప్పగించాల అని దిల్ రాజు ఆలోచిస్తూ తన ఆస్థాన దర్శకుల జాబితాని బయటకి తీసినట్లు బోగట్టా. ఇందులో దిల్ రాజు ఫస్ట్ ఛాయస్ హరీష్ శంకర్ గా ఉందని టాక్. అయితే హరీష్ శంకర్ గతంలో విజయ్ దేవరకొండపై డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. తాను ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండకి ఫోన్ చేస్తే కథ చెప్పడానికి చేస్తున్నానని ముందే ఇప్పట్లో ఖాళీ లేను అని చెప్పాడని, ఆ మాటలు తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. అయితే దిల్ రాజు బాధ్యతలు అప్పగిస్తే చేపట్టేందుకు రెడీ కావొచ్చు. కాని ఇప్పుడు హరీష్ శంకర్ చేతిలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. ఈ నేపధ్యంలో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.