Harish Shankar: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎంతైతే క్రేజ్ ఉంటుందో, డైరెక్టర్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కొంతమంది హీరోలు, డైరెక్టర్ల కాంబోల కోసం అయితే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి హిట్ కాంబోనే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ని ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ తో మరోసారి ‘భవదీయుడు’ సినిమా చేస్తున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలు చేయనున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ తో కలిసి ‘భవదీయుడు’ సినిమా చేయనున్నాడు. అయితే ఇందుకు బాగా టైం పట్టేలా ఉంది. అంత వరకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఖాళీగా ఉండకుండా వేరే హీరోలకు కథలు సిద్ధం చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే సల్లూ భాయ్ కి కథ కూడా వినిపించాడట. ఎలాగైనా సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని గట్టిగా అనుకుంటున్న హరీష్ శంకర్.. ముంబైలో సల్మాన్ ఖాన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట.
Harish Shankar:
హరీష్ శంకర స్వతహాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాగా.. ఆయనతో సినిమా చేయాలని గట్టిగా అనుకుంటున్నాడు. అయితే పవన్ బిజీగా ఉండటంతో తెలుగులో వేరే హీరోలతో సినిమాలు చేయలేక.. బాలీవుడ్ వైపు హరీష్ చూస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తెలుగు డైరెక్టర్ డైరెక్షన్ లో తొలిసారి సల్మాన్ ఖాన్ నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది.