పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిసారి క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే పిరియడికల్ మూవీ చేస్తున్నారు.ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే నలభై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కోవిడ్ కారణంగా తొమ్మిది నెలల క్రితం వాయిదా పడింది.తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు ఓ ట్వీట్ చేశారు.కొత్త షెడ్యూల్ న్యూ ఇయర్ తర్వాత ప్రారంభం అవుతుందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ కోసం ఈ క్రిస్మస్ కు రష్యా వెళ్లనున్న పవర్ స్టార్ ఆ మూవీ షూటింగ్ అనంతరం హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నబోతున్నారు.జనవరిలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం.ముందుగా అనుకున్నట్టు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో రావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.