హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాకి సంబందించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలని సారధి స్టూడియోలో గత రెండు రోజుల నుంచి తెరకెక్కిస్తున్నారు. మధ్యలో మూడు రోజుల పాటు విశాఖలో జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. దీని తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో మళ్ళీ తిరిగి షూటింగ్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. అక్కడ యాక్షన్ ఘట్టాలతో పాటు కీలక సన్నివేశాలని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారని టాక్.
ఇక ఈ షెడ్యూల్స్ లో పవన్ కళ్యాణ్ కి సంబందించిన సీన్స్ అన్ని కూడా పూర్తి చేయడానికి దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత బిజీగా మారే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ సారి హరిహర వీరమల్లు షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి క్రిష్ షెడ్యూల్ వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ సన్నివేశాలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ షాట్స్ ఏవైనా ఉంటే డూప్ పెట్టి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు బోగట్టా. అలాగే మిగిలిన క్యాస్టింగ్ కి సంబందించిన సీన్స్ ని కూడా నెక్స్ట్ షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా అంతే కమిట్మెంట్ తో క్రిష్ కి కావాల్సిన విధంగా పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. గతంలో స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేయడంతో పాటు, అతని ఆలోచనలని కూడా అందులో భాగం చేసేవారు. అయితే ఇప్పుడు రాజకీయంగా బిజీ షెడ్యూల్ ఉండటంతో సినిమా కంటెంట్ లో అస్సలు ఇన్వాల్వ్ కావడం లేదని, క్రిష్ మీద నమ్మకంతో అతను కోరుకున్న విధంగా పూర్తి చేయడానికి రెడీ అయ్యారని టాక్. దీని తర్వాత హరీష్ శంకర్, సముద్రఖని సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుంది అనేది వేచి చూడాలి.