Hardik Pandya : డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ , క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఉదయపూర్‌లో ఈ మధ్యనే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. తమ వివాహ వేడుకలకు సంబంధించిన పిక్స్ ను ఈ జంట రోజుకొకటి వదులుతూ ఇంటర్నెట్ ను జామ్ చేస్తోంది. రీసెంట్ గా జరిగిన వారి వివాహ పార్టీలలో కొన్ని కొత్త చిత్రాలను సోషల్ మీడియా ఫ్యామిలీతో పంచుకున్నారు. అవి పాశ్చాత్య దుస్తులలో డ్యాన్స్ ఫ్లోర్ లో రొమాంటిక్ పోజులు ఇచ్చిన ఈ జోడి పిక్స్ ప్రస్తున్న ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి .

ఈ పార్టీ కోసం హార్దిక్ బ్లాక్ టీ షర్ట్ దానిపైగా వైట్ యానిమల్ ప్రింట్ బ్లేజర్ వేసుకుని, బ్లాక్ ట్రౌజర్‌లో కనిపిస్తుండగా, నటాషా వైట్ ఫెదర్ గౌనులో మెరిసిపోయింది. ఈ జోడికి సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఈ చిత్రాలను పంచుకుంటూ, వారు హార్ట్ ఎమోజీని క్యాప్షన్ గా జోడించారు.

హార్దిక్ పాండ్య వెడ్డింగ్ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 2 ఏళ్ళ కొడుకు సమక్షంలో వారి పెళ్లివేడుక ఎంతో వివైభవం గా జరిగింది. కరోనా సమయంలోనే హార్దిక్ పాండ్య వివాహం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యం లో ఆ సమయం లో పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఈ క్రమంలో ఆ లోటు భర్తీ చేసుకోవడం తో పాటు భార్యపై ప్రేమను చూపేందుకు హార్దిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

ఉదయ్‌పూర్‌లోని రాఫెల్స్‌లో ప్రేమికుల రోజున నటాషా, హార్దిక్ క్రైస్తవ వివాహ వేడుకను నిర్వహించారు. తరువాత, వారు తమ హిందూ వేడుక నుండి అనేక చిత్రాలను పంచుకున్నారు. నటాషా నుదిటిపై బొట్టు పెట్టి హార్దిక్ ఆమె మెడలో మంగళసూత్రాన్ని కట్టిన చిత్రాలను వారు పంచుకున్నారు. హార్దిక్ సోదరుడు , క్రికెటర్ కృనాల్ పాండ్యా ,అతని భార్య పంఖురి శర్మ హిందూ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
