ప్రస్తుతం ఫామ్ లో లేక సతమతువుతున్న ఇండియన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపిఎల్ లో కూడా తన పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశ పరిచారు.దీంతో ఈ నెల 17 నుండి మొదలుకానున్న టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని వేరొక ఆల్ రౌండర్ తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలలో భారత జట్టు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఐపిఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్న వెంకటేష్ ప్రసాద్ ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు.టి 20 వరల్డ్ కప్ కూడా యూఏఈ వేదికగా జరగనున్నది.అందుకే టి 20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి వెంకటేష్ ప్రసాద్ ను తీసుకొచ్చే ఆలోచనలో బిసిసిఐ ఉందని ప్రచారం జరుగుతుంది.