Hanu Raghavapudi: హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సీతారామం.ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుంది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తే సన్నివేశాన్ని వెంకటేష్ కత్రినా కైఫ్ నటించిన మల్లీశ్వరి సినిమా నుంచి కాపీ కొట్టారంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.ఈ సన్నివేశంలో హీరో హీరోయిన్ తో మాట్లాడుతూ నాకు నెలకు 600 జీతం వస్తుంది 12000 బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అంటూ చెప్పే సన్ని వేషాన్ని మల్లీశ్వరి సినిమాతో పోల్చి ట్రోల్ చేశారు. ఇక ఈ సన్నివేశం కాఫీ అంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ స్పందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ మేము ఈ సన్నివేశాన్ని ఏ సినిమా నుంచి కాపీ కొట్టలేదు. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసే సీన్ చాలా సింపుల్ ఐడియా. ఒక అబ్బాయి తన ప్రేయసికి భరోసా ఇవ్వడాన్ని ఆ సన్నివేశంలో చూపించాలనుకున్నాను అందుకే హీరోతో అలాంటి డైలాగ్స్ చెప్పించానని అంతకుమించి ఈ సినిమా నుంచి కాపీ కొట్టలేదని తెలిపారు.అయినా మా సినిమాని మల్లీశ్వరి సినిమాతో పోల్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన తెలిపారు.
Hanu Raghavapudi: నా దృష్టిలో రామ్ ఓ అద్భుతమైన వ్యక్తి…
ఇకపోతే ఈ సినిమాల్లో క్లైమాక్స్ సన్నివేశంపై తనకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయని రామ్ చనిపోకుండా బతికి ఉన్నట్టు చూపిస్తే బాగుండేదని తనకి ఎంతోమంది మెసేజ్ లు పెట్టారని ఈయన తెలిపారు. అయితే రామ్ పాత్రను చంపేయడానికి ఒక కారణం ఉంది. నా దృష్టిలో రామ్ ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ముగింపు కాకుండా పాక్ చేతుల నుంచి విడిపించి తిరిగి ఇండియాకు తీసుకువస్తే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారని తన పాత్రను ముగించామంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.