ఆదిపురుష్ మూవీ నుంచి శ్రీరాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేశారు. చాలా గ్రాండియర్ గా భారీ అంచనాలు క్రియేట్ చేసే విధంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఎంతో కాలం నుంచి ప్రభాస్ ని ఈ తరహా పాత్రలో చూడటానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు శ్రీరాముడు అంటే కేవలం ధర్మపరిపాలకుడుగా, సీతా ప్రేమికుడిగా, మంచి బాలుడు అనే తరహాలోనే మన సినిమాలలో చూపించారు. అయితే రాముడు వారియర్ గా ఎలా ఉంటాడనే విషయాన్ని సరిగ్గా పోర్ట్రైట్ చేయలేకపోయారు. అయితే ఓం రౌత్ ఇప్పుడు ప్రభాస్ ని శ్రీరాముడు పాత్రలో వారియర్ గా చూపించబోతున్నాడు అనేది పోస్టర్ బట్టి అర్ధమవుతుంది. ఇంతకాలం చూసిన మంచి బాలుడు తరహాలో చిద్విలామైన నవ్వుతో కాకుండా గంభీరమైన రాజసంతో పాత్రని తీర్చిదిద్దినాట్లు తెలుస్తుంది.
ఇక ఈ మూవీ టీజర్ అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీని ప్రశాంత్ వర్మ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. సినిమా మీద అంచనాలు కూడా క్రియేట్ చేశారు.
ఇక ఈ మూవీకి సంబందించిన టీజర్ ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అవుతూ ఉండటంతో మొత్తం అటెన్షన్ అంతా అటువైపే వెళ్తుంది. దీంతో హనుమాన్ టీజర్ ని వాయిదా వేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రశాంత్ వర్మ ప్రకటించారు. అక్టోబర్ 2న హనుమాన్ టీజర్ తో వద్దామని అనుకున్నాం కానీ ఆ రోజు ఆదిపురుష్ తో రాముడు వస్తున్నాడని తెలిసింది. అందుకే హనుమాన్ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ టైం చూసుకొని టీజర్ డేట్ ఎనౌన్స్ చేస్తాం అని చెప్పారు. అలాగే ఆదిపురుష్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నామని అందులో రాసుకొచ్చారు.