హీరోయిన్స్ చాలా మంది పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం కామన్ గా జరుగుతుంది. అది కూడా ఆ పెళ్ళై పిల్లలు ఉన్న వ్యక్తి మొదటి భార్యతో విడాకులు ఇచ్చిన తర్వాత సదరు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం తరువాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే కొంత మంది రిలేషన్ మరీ విడ్డూరంగా ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లిలో చిన్న పిల్లగా ఉన్న కరీనా కపూర్ అతని పెళ్ళికి కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది. హీరోయిన్ అయ్యాక అదే సైఫ్ ఆలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే మలైకా అరోరా పెళ్లిలో చిన్న కుర్రాడిగా ఉండి సందడి చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు ఆమెతోనే డేటింగ్ లో ఉన్నాడు.
ఇలా విచిత్ర సంబంధాలు కూడా నార్త్ ఇండియాలో ముఖ్యంగా సెలబ్రెటీ జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ రెండో భార్యగానే వారి భర్తల జీవితాలలోకి అడుగుపెట్టారు. అది కూడా ప్రేమ వివాహాలు చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక టాలీవుడ్ లో కూడా ప్రియమణి భర్తకి రెండో భార్యగానే వెళ్ళింది. ఇప్పుడు హన్సిక మోత్వానీ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సోహైల్ కి రెండో భార్యనే. విశేషం ఏంటంటే సోహైల్ మొదటి పెళ్లిలో హన్సిక బాగా సందడి చేసింది. సోహైల్ తో పాటు, అతని మొదటి భార్య రింకీకి కూడా హన్సిక మోత్వానీ ఫ్రెండ్ కావడంతో ఆమె మొదటి నుంచి ఈ పెళ్లి వేడుకలో ఉంది.
డాన్స్ లు వేస్తూ ఆ పెళ్ళిలో హడావిడి చేసింది. 2016లో సోహైల్ కి రింకీతో పెళ్లి జరిగింది. దానికి సంబందించిన వెడ్డింగ్ వీడియో యుట్యూబ్ లో ఉంది. ఇక హన్సిక సోహైల్ కతూరియాని పెళ్లి చేసుకోబోతున్న అని అతన్ని పరిచయం చేసిన తర్వాత సోషల్ మీడియాలో అతని గురించి చాలా మంది సెర్చ్ చేశారు. అప్పుడే ఈ వీడియో కూడా బయటపడింది. ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని వదిలేసిన వాడిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. దగ్గరుండి అతని మొదటి పెళ్లి చేసిన హన్సికకి మళ్ళీ అతన్నే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సెలబ్రెటీల జీవితాలలో ఇలాంటి కథలు అన్ని మామూలే అని బాలీవుడ్ ని ఫాలో అయ్యేవారు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.