Hair Loss: ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుంది. అయితే దీన్ని నివారించడానికి రకరకాల పద్దతులను వాడుతున్నారు. కొందరు మార్కెట్లో దొరికే ఇతర ప్రోడక్ట్ లను వాడుతుండగా మరికొందరు ఇంటి వద్దనే కొన్ని పదార్థాలను ఉపయోగించి సహజసిద్దమైన పద్దతులతో ఈ సమస్య నుండి బయట పడుతున్నారు. కేవలం జుట్టు రాలే సమస్యే కాకుండా చివర్లు చిట్లడం, పొడిబారడం, దురద వంటి సమస్యలను కూడా దూరం పెట్టొచ్చు. అలాంటి పదార్థాల్లో మనకు జుట్టుకి మేలు చేసేది మెంతులు. మెంతులను పలు విధాలుగా తీసుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
మెంతులను రోజు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మెంతులను నానబెట్టి వాటిని గ్రైండ్ చేసుకుని జుట్టుకు కుదుళ్ళకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య నుండి కాపాడుకోవచ్చు. అయితే వీటిని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుని జుట్టుకు పట్టించాలి. రాత్రిపూట నిద్రకు ముందు మెంతులను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పెరుగు కలుపుకుని ఒక ప్యాక్ లాగా చేసుకుని మాడుకు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత 30 నిముషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
జుట్టుకు తేమనందించడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. మెంతులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ లో కొబ్బరి నూనెను కూడా చేర్చాలి. రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి పేస్ట్ లా చేసుకుని కుదుళ్ళకు పట్టించాలి.
కుదుళ్ళలో ఉన్న జిడ్డుని తొలగించాలంటే నానబెట్టిన మెంతుల్ని గ్రైండ్ చేసుకుని అందులో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పోసి కొద్ది సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తొలగిపోతుంది.
Hair Loss:
చుండ్రు సమస్య ఉందంటే చాలు. దానితో పాటు తలంతా దురద పెట్టడం ప్రారంభం అవుతుంది. ఇలాంటి సమయంలోనే మెంతులతో చేసిన ప్యాక్ ని వాడాలి. కప్పు మెంతుల్ని తీసుకుని వాటిని రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ లా చేసుకుని దాంట్లో గుడ్డు పచ్చ సోన వేసుకుని బాగా కలపాలి. ఇలా కలిపినా మిశ్రమాన్ని జుట్టుకి వాడితే దురద తగ్గుతుంది.