Hair Loss: ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ సమస్య ఎక్కువ అవడానికి సరిగా నిద్ర లేక పోవడం, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే రకరకాల షాంపూలు ఉపయోగిస్తూ వాటి రసాయనాలు మన జుట్టుకు పడక కూడా ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఇవి ఖచ్చింతంగా పాటించాలి.
సాధారణంగా మన జుట్టుకి కొబ్బరి నూనెనే వాడుతూ ఉంటాం. కానీ ఆయుర్వేదం పరంగా చూసుకుంటే కేవలం కొబ్బరి నూనె మాత్రమే కాకుండా వేప నూనె కూడా మన జుట్టుకు మంచి ఔషధంగా పని చేస్తుంది. అయితే వేప ఆకులను గిన్నెలో వేసుకుని నీరు పోసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి వడకట్టి జుట్టుకి పట్టిస్తే తలలో ఉండే ఇన్ఫెక్షన్లు కోల్పోయి జుట్టుకి సంబందించిన సమస్యలను దూరం పెట్టొచ్చు.
కలబంద గుజ్జుని ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి వాడుతూ ఉంటారు. అయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే ఈ కలబంద గుజ్జును జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. అయితే కొబ్బరి నూనెను గోరు వెచ్చగా వేడి చేసుకుని కలబంద గుజ్జుని అందులో వేసుకుని తలకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.
Hair Loss:
జుట్టు రాలడాన్ని నివారించే మరొక పరమౌషధం నిమ్మ రసం. రెండు నిమ్మకాయల రసాన్ని తీసుకుని రెండు కప్పుల నీటిలో కలుపుకొని నిలువ ఉంచుకోవాలి. ఇలా కలిపిన రసాన్ని రోజుకి రెండు సార్లు జుట్టుకి పట్టిస్తే ఈ సమస్య నుంచి త్వరయా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఉల్లిపాయ గుజ్జు కూడా జుట్టుకి మంచి ఔషధంగా పని చేస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసుకుని జుట్టుకు వారం రోజుల పాటు పట్టిస్తే ఈ సమస్యను నివారించవచ్చు.