Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ మూవీ దిగ్విజయంగా దూసుకెళుతోంది. తొలి షోతోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒరిజినల్ కన్నా కూడా ఇదే బాగుందనే టాక్ కూడా వచ్చింది. ఒరిజినల్‌లో కాస్త సాగదీతలు ఎక్కువగా ఉన్నాయని.. వాటన్నింటినీ కట్ చేసి ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని అభిమానులు చెబుతున్నారు.ఇక సత్యదేవ్, చిరంజీవి మధ్య సీన్స్ సినిమాకే హైలైట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు తాను ఎలా ఫీలైంది చిరంజీవి తాజాగా చెప్పుకొచ్చారు. తనకంటే ఎక్కువగా సురేఖ టెన్షన్ పడిందన్నారు. ఈ సినిమా తప్పక బ్లాక్ బస్టర్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నా సరే.. ముందురోజు ఈవ్‌నింగ్ నుంచి ఆమె డల్ అయిపోయారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. తను డల్‌గా ఉండంటం కూడా మెగాస్టార్ కూడా భయపడిపోయారట.ఎన్నో సంవత్సరాలుగా చాలా బాగా ఉన్నాయనుకున్న సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఏమో చెప్పలేము అన్న భయం సురేఖకు వచ్చిందని ఆమె నుంచి తనకు సంక్రమించిందని చిరు ఫన్నీగా చెప్పారు.
ఇక తరువాతి రోజు ఫస్ట్ ఫోన్ కాల్ ప్రసాద్ ఫోన్ చేసి లండన్ నుంచి కాల్ వచ్చిందని ఫస్ట్ హాఫ్ బాగుందన్న టాక్ వచ్చిందని చెప్పారన్నారు. ఆ తరువాత అమెరికా నుంచి తన సోదరుడు లాంటి కుమార్ కాల్ చేశాడని.. ‘అన్నయ్య చాలా బాగుందన్నయ్య.. మీ హెయిర్ స్టైల్, డ్రెస్, వాకింగ్ స్టైల్ చాలా బాగుందన్నయ్యా.. ఇంకా రిపోర్ట్స్ వస్తున్నాయి’ అని చెప్పాడన్నారు. సినిమా ఎలా ఉందిరా అంటే.. డ్రెస్, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ గురించి చెబుతున్నాడంటే నాకెక్కడో డౌట్ వచ్చేసింది. దీంతో డల్ అయిపోయా. ఆ తరువాత 6:30కి అమెరికా నుంచి అనిల్ సుంకర,నవీన్ కాల్ చేశారు. ఏంటిరా ఈ సినిమా? ఆపులేక ఫోన్ చేశాం సర్.. మీకు సత్యదేవ్‌కి మధ్య సీన్స్ అదిరిపోయాయని నవీన్ చెప్పడంతో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆ కొన్ని గంటలు మాత్రం ఎక్కడలేని షివరింగ్ వచ్చిందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.