Hair Fall: జుట్టు రాలే సమస్య ఈ మధ్య అందరిలో అధికంగా మారుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు మగవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న జీవన ప్రమాణాలు, శైలితో ఆడవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. వత్తుగా జుట్టు ఉన్న ఆడవారు కూడా జుట్టు రాలిపోతుంది అని వాపోతున్నారు. జుట్టుకి సరైన పోషణ లేకపోవడం దీనికి ప్రధాన సమస్య అంటున్నారు.
జుట్టు రాలుతోందా అయితే ఈ వండర్ ఆయిల్ మీ కోసమే..
జుట్టుని అందానికి సంకేతంగా చూస్తారు చాలా మంది. జుట్టు రాలుతుంది అంటే చాలు ఎంతో గాబరా పడిపోయి డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు. ఇది సహజం. అందరు తాము అందంగా ఉండాలని తమ జుట్టు తళతళలాడుతూ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికోసమే ఈ వండర్ ఆయిల్. పైగా ఇది తయారు చేసింది ఎదో పెద్ద సంస్థ కాదు,ఒక 80 ఏళ్ళ వృద్ధుడు.
జుట్టు రాలుతుంది అంటే మనం చేసే మొదటి పని అమ్మానాన్న దగ్గరికి పరిగెత్తడం. అలా పరిగెత్తిన అమ్మయికి బహుశా తెలియకపోవచ్చు తన సమస్య ఒక సంచలనానికి నాంది కాబోతుంది అని. ఆ యువతి అమ్మానాన్న ఆమెకే కాదు జుట్టు సమస్య ఉన్న చాలామందికి పనికొచ్చే ఒక అద్భుతాన్ని సృష్టించారు.
Hair Fall:
వినీత అనే యువతి తన జుట్టు సమస్య గురించి అమ్మానాన్నకి చెప్పింది. సమస్య గురించి విన్న ఎనభై అయిదేళ్ల రాధాకృష్ణ చౌదరికి ఆయుర్వేదంలో కొద్దిగా పరిచయం ఉంది. దీంతో తన అనుభవాన్ని రంగరించి ఒక ఆయిల్ ని తయారు చేసారు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీల దాకా ఈ ఆయిల్ పాకింది. ఇందులో వాడే పదార్థాలు అన్నీ ఆయుర్వేదం లో చెప్పినవే. ఇంట్లో తయారుచేసిన ఈ ఆయిల్ ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. కొంట్ల మేరకు సేల్స్ కూడా వచ్చాయంటే అర్థం చేసుకోండి.