Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈ సీరియల్లో ఈరోజు ఆగస్టు 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సాక్షి కోపంతో ఈ నిశ్చితార్థం తనకు వద్దని ఉంగరంపై ‘వి’ అనే అక్షరం ఉందని నా పేరు సాక్షి సాక్షి అంటే ఎస్ అని ఉండాలి కదా వి అని ఎందుకు ఉంది. అని ప్రశ్నిస్తుంది. సాక్షి రిషితో ఎస్ అనే రాయించాలి కదా వి అని ఎందుకు రాయించాలని ప్రశ్నించగా అందుకు బదులుగా రిషి సారీ చెబుతుండగా సారీ నా కాబోయే భార్యని అప్పుడే మర్చిపోయావా అనుకోకుండా జరిగిందా నువ్వేం మాట్లాడుతున్నావ్ రిషి నా పేరు మర్చిపోయావా లేదంటే వసుధర ప్రేమను మరవలేకపోయావా. అప్పుడు రిషి గట్టిగా సాక్షి అంటే దానికి ఆ రిషి ఇప్పుడు గుర్తుకొచ్చిందా నా పేరు సాక్షి అని ఇక జీవితాంతం నువ్వు సాక్షి అని పిలుస్తావా లేక వసుధార అని పిలుస్తావా. అప్పుడు సాక్షి తల్లిదండ్రులు కలుగ చేసుకోగా మీరు ఆగండి అంటుంది.
తరువాత దేవయానితో సాక్షి రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుడితే కూడా మీ అమ్మ వసుధార అని అంటాడేమో.వసుధార అనే పేరు వింటుంటే నాకు కంపరంగా ఉంది ఆయన జీవితాంతం నన్ను వసుధార అని పిలుస్తాడు. జీవితాంతం మానసికంగా చస్తూ బతకాలి. ఈ జీవితం నాకొద్దు. ఈ పెళ్లి నాకు వద్దు. ఈ నరకం నాకు వద్దు. దేవయాని నచ్చ జెప్పే ప్రయత్నం చేయబోతుండగ సాక్షి ఆగండి ఆంటీ జీవితాంతం ఇలా బతకడం నావల్ల కాదు. సాక్షి తండ్రి ఏమిటమ్మా ఇది అని అడగక మీకు తెలియదు మీరు ఊరికే ఉండండి అంటుంది. రిషి తల్లిని కాదన్నావంటే ఆంటీది తప్పనుకున్నాను. వసుధార నిన్ను కాదనుకుంటే పిచ్చిది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది. నీకు ప్రేమ విలువ తెలియదు. జగతి ఆంటీ సూపర్ మీరు చెప్పిందే కరెక్ట్. దానికి దేవయాని కోపంతో ఏం చెప్పి సాక్షి మనసు విరిగేలా చేశావు. దానికి బదులుగా సాక్షి జగతి ఆంటీ నా మనసు విరగొట్టలేదు.
రిషి మనసులో నువ్వు లేవని ముందు ముందు అది నీకే ప్రాబ్లం అవుతుందని ముందుగానే చెప్పారు. కానీ నేనే వినలేదు. తర్వాత సన్నివేశంలో సాక్షి దేవయానితో మీకో దండం మీ పెంపకానికో దండం అంటే దానికి దేవాయని సాక్షి తప్పు చేస్తున్నావు జీవితాంతం బాధపడతావు అంటుంది. అప్పుడు బాధ కాదు ఆంటీ సంతోషపడతాను అని బదులిస్తుంది సాక్షి. రిషి సాక్షితో ఏమైంది నీకు అని ప్రశ్నించగా నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. దానికి గర్వపడుతున్నాను. ఛీ ఛీ ఇంతకాలం నేను ఆరాటపడింది నీకోసమా. లండన్ నుంచి వచ్చింది నీ కోసమా. ఇది నా ఓటమి కాదు నీ ఓటమి నేను గెలిచి వెళ్తున్నాను. దానికి రిషి సెటప్ సాక్షి నీకు ఈ పెళ్లి నచ్చకపోతే వెళ్ళిపో అంతేకానీ నోటికొచ్చినట్లు మాట్లాడకు అంటే దానికి సాక్షి నేను ఎందుకు వెళ్తున్నాను నీకు తెలియాలి కదా రిషి అందుకే ఇన్ని మాటలు మాట్లాడాను.
అక్కడ నుంచి సాక్షి వెళ్ళిపోతుంది. తరువాత వసుధార తన కాళ్ల వద్ద పడిన ఉంగరాన్ని తీసుకొని రిషి వైపు దీనంగా చూస్తూ బయటకు వస్తే అక్కడ సాక్షి ఏంటి వసుధర హ్యాపీనా ఫుల్ కుష్ కదా నువ్వు నా లైఫ్ స్మాష్ అయింది. లైఫ్ అవుట్ కదా, రిషి నాకు దక్కాలని అతనితో జీవితం పంచుకోవాలని తప్పించాను అంతా అయిపోయాయి. నువ్వు హ్యాపీ నే కదా. ఇదంతా దూరం నుంచి రిషి చూస్తూ ఉంటాడు. సాక్షి వసుతో మనసు ఆనంద తాండవం చేస్తుందా అంటే దానికి బదులుగా వసు సాక్షి ఈరోజు ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు నీవే వద్దనుకున్నావు. ఇందులో ఎవరిని తప్పు పట్టలేము. నువ్వే వద్దనుకున్నావు కదా. ఒకరి గెలుపు కోసం మనం కోరుకుంటే మనసు హాయిగా ఉంటుంది. ఒకరి ఓటమి కోసం ప్రార్థిస్తే ఒకరి నాశనాన్ని కోరుకుంటే కరెక్ట్ కాదు సాక్షి. సాక్షి ఒకరి మంచి కోరుకో గెలుస్తావు ఒకరి చెడు కోరుకుంటే ఇలాగే ఉంటుంది సాక్షి అయినా ఒకరి ఓటమిన్ చూస్తే నేను సంతోషించే దాన్ని కాదు నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు.
మొదటినుంచి మొండితనంతో ముందుకు వెళ్లావు, అసాధ్యాన్ని సాధించాలని కోరుకున్నావు, ఏదో ఒకసారి గాలివాటంలో అదృష్టం అన్నట్టుగా విజయం దక్కుతుందేమో, అన్నిసార్లు అది సాధ్యం కాదు సాక్షి. మనిషి గాలివాటం కాదు వ్యక్తిత్వాన్ని బట్టి నడుచుకోవాలి. రిషి సాక్షి వసుధార వద్దకు వస్తాడు. అప్పుడు కోపంతో సాక్షి వాసు నీతో ఒక మాట చెప్తాను విను రిషిని కాదని నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్వు అదే మాట మీద ఉండు. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అసలు రిషికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, రిషి ఎవరిని ప్రేమించలేడు, ఇతనికి ప్రేమ విలువ తెలియదు,అమ్మాయిలను గౌరవించడం తెలియదు, అసలు కన్నతల్లిని అమ్మ అని పిలవడం తెలియదు, ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. సినిమాలు, కబుర్లు ఇలాంటి ఏవి తెలియదు. ఒక ఎంటర్టైన్మెంట్ తెలియదు. ప్రేమగా మాట్లాడడం తెలియదు. అవునులే ప్రేమే తెలియనప్పుడు ప్రేమగా ఎలా మాట్లాడుతాడు.
Guppedantha Manasu:
చూడు వసుధార నాలాంటి బాధ నువ్వు పడకూడదని చెబుతున్నా ఈరోజు నా ముందు నీ పేరు కలవరిస్తున్నాడు రేపు నీ ముందు ఇంకొకరి పేరు కలవారిస్తాడేమో. నువ్వు నీలాగే ఉండు వసుధార. సాక్షి రిషితో నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా. నేను వెళ్ళిపోతున్నది ఇంట్లో నుంచి జీవితం నుండి కాదు నీ జీవితంలో ఇవన్నీ శాపాలుగా ఏదో ఒక రోజు కచ్చితంగా తగులుతాయి రిషి అంటూ వెళ్ళిపోతూ నీ జీవితంలో నిన్ను ఎవరిని దగ్గర కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూ నీకు నిద్ర లేకుండా చేస్తాను మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది. తరువాత వసు కూడా వెళ్ళిపోతుంది. మహేంద్ర ఆనందంగా బయటికి వచ్చి నువ్వే గెలిచావు రిషి. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఒక రేంజ్ లో నిన్ను తిట్టుకున్నాను. నీ మనసు గెలిచింది నీ ప్రేమ గెలిచింది దానికి బదులుగా రిషి నేను ప్రేమను ప్రేమించాను డాడ్ మనుషులు ఓడిపోవచ్చేమో కానీ ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సన్నివేశంలో ధరణితో గౌతమ్ మంచి స్వీట్ కావాలి అని అడుగుతుండగా జగతి వచ్చి గౌతమ్ ఈ అకేషన్ కోసం చేసిన స్వీట్స్ ఉన్నాయి కదా అంటే చూడండి మేడం వాటి కోసం చేసిన స్వీట్స్ కిక్కు ఏముంటుంది.
మనం సెలబ్రేట్ చేసుకోవాలి దాని కోసం స్పెషల్ స్వీట్ కావాలి అప్పుడు జగతి పోనిలే ధరణి, గౌతం ముచ్చట పడుతున్నాడు కదా ఆ స్వీట్లు చేసి పెట్టు అక్కడికి దేవయాని కోపంగా వచ్చి జగతి ఏంటి నిశ్చితార్థం తప్పిపోయిందని స్వీట్స్ ఏమంటున్నావా, ఏం ధరణి నీకు ధైర్యం బాగా దిగినట్టు ఉంది కదా. మీరందరూ కోరుకున్నదే జరిగింది కదా మీ కళ్ళు చల్లబడ్డాయా దానికి జగతి అక్కయ్య గౌతమ్ స్వీట్స్ అడిగాడు. అనగా దానికి దేవయాని గౌతమ్ స్వీట్స్ అడిగితే ఇంట్లో శుభకార్యం చెడిపోయింది ఈ టైంలో స్వీట్స్ ఏంటి అని నువ్వు చెప్పాలి కదా. ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తరువాతి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు మరి.