Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార,రిషీ తో ఇక్కడ రెండు మనసులు ఉన్న ఒకే గుండె చప్పుడు అంటూ నన్ను క్షమించండి సార్. నా ప్రేమను యాక్సెప్ట్ చేయండి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేస్తుంది. తన చేతిలో ఉన్న గిఫ్ట్ రిషికి ఇస్తూ ఉండగా చేయి జారితే కింద పడకుండా పట్టుకుంటాడు రిషి దీనిని నేను జాగ్రత్తగా కాపాడతాను వర్షం ఎక్కువగా వచ్చేలా ఉంది వెళ్దాం పద అని వెళ్తారు.
తరువాత సన్నివేశంలో మహేంద్ర,జగతి తో పరీక్షలు అయిపోయాక వసు, రిషీ కలిసి అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు నేను వసు మాటల్లో గమనించాను. తను మనసులో మాట రిషికి చెప్పేస్తుందేమో అంటే దానికి జగతి ఒకప్పుడు రిషీ చెప్పినప్పుడు వసు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నాకు అర్థం కావడం లేదు వసు ను అడిగిన చెప్పడం లేదు అంటే దానికి బదులుగా మహేంద్ర రిషి ఇంటికి వస్తే అడిగేస్తాను అంటాడు.
వసుధార, రిషీ ఇక జీవితమంతా మీతోనే అంటే అలాగే మన మధ్య దాపరికాలు ఉండకూడదు దాపరి కాలు లేని ప్రేమ నిలబడుతుంది అంటాడు రిషి. ఆ రోజు నేను నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నిన్ను బెదిరించింది ఎవరు అని ప్రశ్నిస్తే సాక్షి అని చెబుతుంది వసు. నేను కూడా ముందే ఊహించాను అంటాడు రిషి. తరువాత ఉంగరాన్ని చూస్తూ వి పక్కన ఆర్ అక్షరం చేరినంత మాత్రాన మనం ఒకరంటే ఒకరు కాలేము, అలా కావాలంటే ఒక పని చేయాలి అంటే ఏం చేయాలని అడుగుతుంది వసు. రిషి నీ ప్రేమను త్యాగం చేయాలి అంటాడు. అప్పుడు వసు త్యాగం ఏంటి సార్ నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను ప్రేమను ఎలా వదులుకోగలను అంటుంది వసుధార. అప్పుడు రిషి నీ ఆశయం లక్ష్యం మర్చిపోయావా ముందు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు అంతవరకు మనం కలవడం జరగదు, నీవు అందరిలాంటి ఆడపిల్లవు మాత్రం కాదు ఆశయం కోసం కుటుంబాన్ని పెళ్లి పీటల పైనుంచి వచ్చేసావు. మన ప్రేమ నీ ఆశయాన్ని మర్చిపోయేలా చేసింది. అది మన ప్రేమకి అవమానం. అప్పుడు వసు ఆ రింగ్ నాది, నా ప్రాణం, యూనివర్సిటీ టాపర్ కన్నా ఆ రింగ్ మీతో తొలగించుకోవడమే నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి, ఈ రింగ్ ఎప్పటికీ నాదే కదా అని ప్రశ్నిస్తుంది. ఈ రిషేంద్ర భూషణ్ నీకు మాటిస్తున్నాడు పంచభూతాలు, ఈ వర్షం, మన మనసులు సాక్ష్యం ఎప్పటికీ ఇది నీదే, కానీ నీ ఆశయం, చదువు వదులుకోనని నాకు మాట ఇవ్వు, మీ దృష్టి అంతా చదువు మీదే పెట్టు అంటే దానికి సంతోషంగా అంగీకరిస్తుంది వసుధార. పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రేమ గురించి ఆలోచించను. మాట ఇస్తుంది వసుధార.
Guppedantha Manasu:
తరువాత వసు, రిషి ని కౌగిలించుకుంటుంది. అప్పుడు రిషి ఈ నింగి నేల సాక్షిగా ఈరోజు నుండి మన ప్రేమ మొదలు అవుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని కలుసుకున్న సమయం. ఇది జ్ఞాపకం కాదు శాశ్వతం. తర్వాత కారులో వెళ్తూ రిషి, వసుధార ఏంటో ఈ ప్రయాణం ఈరోజు చాలా కొత్తగా ఉంది కదా అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.