Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈరోజు ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇస్తూ అందరి సంగతి ఏమో కానీ నేను ఈ కాలేజీని వీడలేనేమో అంటుంది. తాను ఈ కాలేజీలో చేరినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను ఈ కాలేజీలో చేరటం ఒక అద్భుతం. డిబిఎస్టి కాలేజీలో చేరినందుకు యూత్ ఐకాన్ గా పేరు రావడం. డీబీఎస్టి కాలేజ్ లో చేరకపోతే నాకు జీవితమే ఉండేది కాదు. అంటూ నన్ను ఈ కాలేజీకి పంపించిన, చేర్పించిన, నాకు వసుధారగా గుర్తింపు తీసుకొచ్చిన జగతి మేడం, మహేంద్ర సార్, రిషీ సార్ లను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ చాలా ఎమోషనల్ అయినా వసుధార. తరువాత అందరూ రిషీతో ఆటోగ్రాఫ్ తీసుకొని ఫోటో దిగుతారు.
తరువాత సన్నివేశంలో కారులో వెళ్తున్న రిషికి,వసు కనపడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు వసు డ్రాప్ చేస్తాను పద అంటే కాస్త మాట్లాడాలి అంటుంది. రిషి మరి మాట్లాడు అంటే నేను కాదు సార్ నా మనసు మాట్లాడుతుంది అంటుంది వసు. వర్షం వచ్చేలా ఉంది అంటాడు రిషి. అప్పుడు వసు మేఘాలు అన్ని కలుపుకొని వర్షం మొదలైనప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి మనం ఒకరితో పరిచయం ఏర్పడి వారితో ప్రయాణం చేసి తర్వాత అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో తెలియదు. మీతో నా పరిచయం నా ప్రయాణం తర్వాత ఎలా ఉంటుందో మీరే సమాధానం చెప్పాలి అంటే అసలు ప్రశ్నవేయలేదు అంటాడు. అప్పుడు రిషి గతంలో ఇచ్చిన గిఫ్ట్ ను బయటికి తీసి ఒక్కొక్కసారి ప్రశ్న సమాధానం పక్కపక్కనే ఉంటాయి అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
తర్వాత గిఫ్ట్ ను చూపిస్తూ ఇది మీ మనసు సార్ అంటుంది. అప్పుడు రిషి నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది. నన్ను కాదు అనుకున్నావు కదా అంటూ గతంలో వసు చెప్పిన మాటను గుర్తు చేస్తాడు. పగిలింది గాజు ముక్కలు సార్ గాజులాంటి మనసు కాదు .అంటే మీ పక్కన ఇంకో అక్షరాన్ని దాన్ని ఎందుకు చేర్చావు అంటే ప్రేమ సార్ అంటుంది. ఆరోజు ఎంత చేదు క్షణాల్ని అందించిందో నాకు మాత్రమే తెలుసు అంటాడు రిషి. నేను కాదన్నానని మీరు ఎంత బాధ పడ్డారో నేను అందుకు వందరెట్లు ఎక్కువగానే బాధపడ్డాను. ఒక్కోసారి గాయపడిన వారి కంటే గాయపడేలా చేసిన వారికి ఎక్కువ బాధ మిగులుతుంది సార్. అప్పుడు నో అన్నావ్ ఇప్పుడు ప్రేమ అంటున్నావు ఇదంతా ఏంటి వసుధార అంటాడు రిషి. అప్పుడు వసు పొలంలో నాటిన విత్తనం వర్షం కోసం ఎదురుచూస్తుంది సార్. నేను కూడా అలాగే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత విలవిల్లిలాడిపోయాను.
Guppedantha Manasu:
ల్యాబ్ లో జరిగిన సన్నివేశం గురించి గుర్తుచేస్తుంది. మీరు నా ఎదురుగా ఉంటారు నో అన్నానని బాధపడతారు. మీతో చెబితే మీరు అర్థం చేసుకుంటారో లేదో అని నా భయం. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను సార్ మీ బాధ ముందు అవేమీ నాకు కనబడటం లేదు. నాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలి, వి ఒక ఒంటరి అక్షరం ఆర్ అండగా తోడవాలి అందుకే ఈ రెండు అక్షరాలను కలిపాను. మీరు లేకుండా ఈ వసుధార లేదు. ఇక్కడ రెండు గుండెలు ఉన్న ఆ రెండు గుండెల చప్పుడు ఒకటే అదే ప్రేమ. నన్ను క్షమించండి, ఆ ప్రేమను అంగీకరించండి, ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేయగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.