Guppedantha Manasu: ఈ రోజు ఎపిసోడ్ లో వసు, రిషి మాట్లాడుకుంటారు. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడుతారో ఒకసారి నా ముందు మాట్లాడు అని భయం పోగొట్టేలా చేస్తాడు రిషి. అప్పటికే అక్కడికి వచ్చేసిన జగతి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతుంది. మరోవైపు దేవయాని ఇంటర్వ్యూ ఆగిపోవడానికి ఏదో కుట్ర చేస్తుంది. దీంతో ఒకరితో ఫోన్లో మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ధరిణి కంగారు పడుతుంది.
మళ్లీ అత్తయ్య గారు ఏం చేస్తున్నారో అని అనుకుంటుంది. ఇక దేవయాని ఈ మాటలు ధరణి విన్నదేమో అని ఏం చేస్తున్నావు అని అంటుంది. వంట చేస్తున్నాను అని ధరణి అనటంతో తను ఏమి వినలేదు అని అనుకుంటుంది. ధరణి కాఫీ కావాలా అడగడంతో తనపై కాస్త వెటకారం చేస్తుంది. ఇక ధరణి తన మనసులో అత్తయ్య ఏదో కుట్ర చేస్తుంది అని వెంటనే ఈ విషయం రిషి వాళ్లకు చెప్పాలి అని అనుకుంటుంది.
దాంతో అక్కడి నుంచి బయలుదేరుతుండగా దేవయాని తనకు తలనొప్పిగా ఉంది అని తల పట్టమని అంటుంది. ఇక కాసేపు జగతి వాళ్ల గురించి మాట్లాడుతుంది దేవయాని. ఇక ఓవైపు మహేంద్ర గౌతమ్ తో జగతి ఇలా వెళ్లిపోతుందనుకోలేదు అని బాధపడతాడు. ఇక గౌతమ్ మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అనడంతో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు మహేంద్ర. అదే సమయంలో గౌతమ్ ఫోన్ కి దానిని ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పటంతో వాళ్లు కంగారు పడతారు.
ఇక ఆఫీస్ బాయ్ కూల్ డ్రింక్ ఇవ్వడానికి వసు దగ్గరికి రాగా ఆ కూల్ డ్రింక్ వసు డ్రెస్ మీద పడుతుంది. దాంతో రిషి అతనిపై ఫైర్ అవుతాడు. డ్రెస్ మార్చుకొని రమ్మంటాడు. ఇక వసు జగతి గురించి ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి జగతి వస్తుంది. ఇక వసు జగతిని చూసి ఆనందంలో గట్టిగా పట్టుకుంటుంది. జగతి వసుకి కంగ్రాట్స్ అని చెబుతుంది.
ఈ విజయం నీది కాదు నాది, రిషిది అంటూ పొగుడుతుంది జగతి. ఎలాగైనా ఈ ఇంటర్వ్యూ ని ధైర్యంగా ఫేస్ చేయాలి అని చెబుతుంది. దాంతో వసు కూడా ధైర్యంగా ఫేస్ చేస్తాను అని అంటుంది. అప్పుడే రిషి కూడా రావటంతో జగతిని చూసి సంతోషపడతాడు. తన తండ్రి కూడా వచ్చాడు అని ఆనందంలో పొంగిపోతాడు.
Guppedantha Manasu:
కానీ మహేంద్ర వర్మ రాకపోవటంతో బాధపడతాడు. కచ్చితంగా నేనే ఏదో తప్పు చేశాను అని అనుకుంటాడు. అక్కడే ఉన్న జగతితో నేనేం చేశాను చెప్పండి మేడం అంటూ ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నా తప్పేంటో చెప్పి వెళ్ళండి అని అంటాడు. ఆ తర్వాత వసు మార్చుకోవడానికి వెళ్లగా అక్కడ ఆఫీస్ బాయ్ డోర్ లాక్ చేస్తాడు. ఇక ఇంటర్వ్యూకి టైం అవ్వటంతో వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రిషి.